Loading...
IND vs WI: టీమిండియా-వెస్టిండీస్‌ పోరు.. గణాంకాల్లో పైచేయి ఎవరిదంటే?
టీమిండియా-వెస్టిండీస్‌ పోరు.. గణాంకాల్లో పైచేయి ఎవరిదంటే?

IND vs WI: టీమిండియా-వెస్టిండీస్‌ పోరు.. గణాంకాల్లో పైచేయి ఎవరిదంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 28, 2026
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌ (ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్) సూపర్‌-8 దశలో భాగంగా ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత జట్టు, వెస్టిండీస్‌తో తలపడనుంది. భారత్‌కు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తుండగా, కరేబియన్ జట్టుకు షాయ్ హోప్ సారథ్యం అందిస్తున్నారు. సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. ఇదే పరిస్థితి వెస్టిండీస్‌కూ వర్తిస్తుంది. ఈ మెగా టోర్నీలో టీమ్ ఇండియా ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ ఆడటం ఇదే తొలిసారి. అయితే వెస్టిండీస్ జట్టు గ్రూప్ దశలోనే ఇక్కడ స్కాట్లాండ్, ఇటలీతో మ్యాచ్‌లు ఆడి అనుభవం సంపాదించింది. ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్‌లో ఇరు జట్ల మధ్య గణాంకాలు పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయి.

Details

టీ20 మ్యాచుల్లో ముఖాముఖి

భారత్, వెస్టిండీస్ ఇప్పటివరకు 30 టీ20 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి.

వాటిలో టీమ్ ఇండియా 19 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

వెస్టిండీస్ 10 మ్యాచ్‌ల్లో గెలిచింది.

ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.

టీమ్ ఇండియా స్వదేశంలో 8, వెస్టిండీస్ గడ్డపై 5, తటస్థ వేదికలపై 6 విజయాలు నమోదు చేసింది.

కరేబియన్ జట్టు స్వదేశంలో 5, భారత గడ్డపై 2, తటస్థ వేదికలపై 3 మ్యాచ్‌లు గెలిచింది.

Details

టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో

పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 4 సార్లు తలపడ్డాయి.

ఇందులో భారత్ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలవగా, వెస్టిండీస్ మూడు సార్లు విజయం సాధించింది.

కరేబియన్ జట్టుపై టీమ్ ఇండియా అత్యధిక స్కోరు 192, అత్యల్ప స్కోరు 130.

భారత జట్టుపై వెస్టిండీస్ అత్యధిక స్కోరు 196, అత్యల్ప స్కోరు 129.

మొత్తంగా టీ20ల్లో వెస్టిండీస్‌పై భారత్‌కే పైచేయి ఉన్నప్పటికీ, పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో మాత్రం కరేబియన్ జట్టు రికార్డు కాస్త మెరుగ్గా ఉంది.

జింబాబ్వేపై సాధించిన విజయంతో టీమ్ ఇండియా ఉత్సాహంగా ఉంది. అదే జోష్‌ను కొనసాగిస్తూ వెస్టిండీస్‌ను కూడా ఓడించాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు.

ADVERTISEMENT