ప్రపంచ టేబుల్ టెన్నిస్ కు ఎంపికైన తెలంగాణ అమ్మాయి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మరోసారి సత్తా చాటింది. ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ లో పాల్గొనే భారత్ జట్టుకు ఎంపికై రికార్డు సృష్టించింది. మే 20న దక్షిణాఫ్రికాలోని డర్బన్ లో ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ ప్రారంభం కానుంది.
ఈ టోర్నీలో పాల్గొనే 11 మంది సభ్యుల భారత జట్టును టీటీ సమాఖ్య ప్రకటించింది.
ఇందులో ఐదుగురు పురుషులు, ఆరుగురు మహిళలున్నారు. మహిళల సింగిల్స్ లో శ్రీజతో పాటు మనిక బత్రా, సుతీర్థ ముఖర్జీ, రిత్ రిష్య బరిలో దిగనున్నారు. డబుల్ లో శ్రీజ-దివ్య, అర్చన-మనిక జోడీలుగా పోటీపడనున్నారు.
Details
పురుషుల డబుల్స్ లో జోడిగా సత్యన్-శరత్
ఈ మధ్య వరల్డ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్ షిప్ కు ఆకుల శ్రీజ అర్హత సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్ షిప్ భారత్ తరుపున పాల్గొనడం ఆనందంగా ఉందని శ్రీజ తెలియజేశారు.
పురుషుల సింగిల్స్ కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత ఆంచట శరత్ కమల్, సత్యన్, మనుష్ షా, హర్మీత్ దేశాయ్, మానవ థక్కర్ పోటీపడనున్నారు. పురుషుల డబుల్స్ సత్యన్-శరత్, మనుష్-హర్మీత్.. మిక్స్‌డ్ డబుల్స్‌లో సత్యన్-మనిక, మానవ్ థక్కర్-అర్చన జోడీలుగా బరిలోకి దిగనున్నారు.