Dheeraj: ఆసియా నంబర్‌వన్‌గా తెలుగు తేజం ధీరజ్ బొమ్మదేవర
ఈ వార్తాకథనం ఏంటి
భారత యువ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర తాజా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మరో కీలక ఘనత సాధించాడు. విజయవాడకు చెందిన ఈ ప్రతిభావంతుడు పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో 225.5 పాయింట్లతో ఆసియా నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అంతేకాదు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కూడా ధీరజ్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని ఎనిమిదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ప్రస్తుత టాప్-10 ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ఆర్చర్‌గా ధీరజ్ నిలవడం విశేషం.
వివరాలు
గోల్డ్ మెడల్ తో సత్తా చాటిన ధీరజ్
ఇటీవల జరిగిన ప్రపంచకప్ స్టేజ్-3 టోర్నీలో ధీరజ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకంతో పాటు మిక్స్‌డ్ ఈవెంట్‌లో కూడా గోల్డ్ మెడల్ సాధించి సత్తా చాటాడు.
అనంతరం జరిగిన స్టేజ్-4 టోర్నీలో మిక్స్‌డ్ విభాగంలో కాంస్య పతక పోరుకు అర్హత సాధించినప్పటికీ, చివర్లో స్వల్ప తేడాతో పతకాన్ని చేజార్చుకున్నాడు.
ఇక మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్ ఆర్చర్ జ్యోతి సురేఖ 291.25 పాయింట్లతో ఒక స్థానం కోల్పోయి నాలుగో ర్యాంక్‌లో నిలిచింది.
మరో భారత ఆర్చర్ తానిపర్తి చికిత రెండు స్థానాలు దిగజారి 52వ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.