LOADING...
T20 World Cup: అన్నా-తమ్ముళ్ల మధ్య సమరం.. వరల్డ్‌కప్‌లో ఆసక్తికర పోరు
అన్నా-తమ్ముళ్ల మధ్య సమరం.. వరల్డ్‌కప్‌లో ఆసక్తికర పోరు

T20 World Cup: అన్నా-తమ్ముళ్ల మధ్య సమరం.. వరల్డ్‌కప్‌లో ఆసక్తికర పోరు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 21, 2026
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8 దశలో ఆదివారం భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఒక ఆసక్తికరమైన ప్రత్యేకత కూడా జతకట్టింది. దక్షిణాఫ్రికాకు చెందిన క్రికెట్‌ బ్రదర్స్‌ మోర్నే మోర్కెల్, ఆల్బీ మోర్కెల్ ఒకరికి ఒకరు ప్రత్యర్థి శిబిరాల్లో ఉండటం విశేషం. ప్రస్తుతం మోర్నీ టీమ్‌ఇండియాకు బౌలింగ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, అల్బీ దక్షిణాఫ్రికా జట్టుకు ప్రత్యేక సలహాదారుగా సేవలందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అల్బీ మోర్కెల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "మేమిద్దరం ఎక్కువగా మాట్లాడుకోం. మాలో ఎవరు పైచేయి సాధిస్తామో అన్న ఆతృత మాకంటే మా అమ్మకే ఎక్కువగా ఉంది. ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక ఆమె అయోమయంలో ఉందని సరదాగా చెప్పాడు.

Details

అరుదైన ఘటనగా చెప్పొచ్చు

చరిత్రలో ఒకే జట్టుకు సోదరులు కలిసి ఆడిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో వేర్వేరు జట్ల కోచింగ్‌ బృందాల్లో సోదరులు పనిచేయడం అరుదైన సంఘటనగా చెప్పాలి. దేశీయ స్థాయిలో ఇలాంటి సంఘటనకు ఉదాహరణగా కోల్‌కతా డెర్బీ నిలుస్తుంది. ఈస్ట్‌ బెంగాల్‌, మోహన్‌ బగాన్‌ జట్లకు ప్రణబ్‌ నంది, పలాష్‌ నంది అనే సోదరులు వేర్వేరు కోచ్‌లుగా వ్యవహరించారు. అలాగే ఫుట్‌బాల్‌లో 1966లో బాబీ, జాక్‌ బ్రదర్స్‌ ఇంగ్లిష్‌ లీగ్‌లో భిన్న జట్లకు బాధ్యతలు చేపట్టారు. జాక్‌ మిడిల్‌స్బరో జట్టుకు, బాబీ ప్రెస్టన్‌ నార్త్‌ ఎండ్‌ జట్టుకు మేనేజర్లుగా సేవలందించారు. ఇలా కుటుంబ బంధం ఒకవైపు, ప్రొఫెషనల్‌ పోటీ మరోవైపు — భారత్‌-దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు ఈ సోదరుల కోణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

Advertisement