LOADING...
IND vs ZIM : జింబాబ్వే చివరిసారి భారత్‌లో ఆడినప్పుడు.. ఇషాన్ 4, అభిషేక్ 2 ఏళ్లు!
జింబాబ్వే చివరిసారి భారత్‌లో ఆడినప్పుడు.. ఇషాన్ 4, అభిషేక్ 2 ఏళ్లు!

IND vs ZIM : జింబాబ్వే చివరిసారి భారత్‌లో ఆడినప్పుడు.. ఇషాన్ 4, అభిషేక్ 2 ఏళ్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 23, 2026
05:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన పోరులో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఈ టోర్నీలో భారత్‌కు ఇదే తొలి ఓటమి అయినప్పటికీ, సెమీఫైనల్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. సెమీస్‌కు చేరాలంటే భారత్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాటిలో ఒక మ్యాచ్ గురువారం జింబాబ్వేతో జరగనుంది. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే, ఈ మెగా టోర్నీలో జింబాబ్వే అంచనాలకు మించి ప్రదర్శన చేస్తోంది. గ్రూప్ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంకలపై విజయాలు సాధించి సత్తా చాటింది.

Details

భారత్‌లో టీ20 మ్యాచ్ ఆడలేదు

ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, 2002 నుంచి భారతదేశంలో భారత్-జింబాబ్వే జట్ల మధ్య ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. దీంతో రాబోయే పోరుపై అందరి దృష్టి నిలిచింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, జింబాబ్వే జట్ల మధ్య ఇప్పటివరకు ఒకే ఒక్క మ్యాచ్ జరిగింది. 2022 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే జింబాబ్వే జట్టు ఇప్పటివరకు భారతదేశంలో భారత్‌తో ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు.

Details

చివరి మ్యాచ్ ఎప్పుడంటే...

రెండు జట్లు చివరిసారిగా భారత గడ్డపై 2002 మార్చి 19న గౌహతి వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో జింబాబ్వే 232 పరుగులకు ఆలౌటైంది. అప్పట్లో ఇషాన్, అభిషేక్ వయసెంత? రెండు జట్లు భారతదేశంలో చివరిసారి తలపడ్డ సమయంలో ప్రస్తుత ఓపెనర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ చిన్నారులే. ఇషాన్ కిషన్ 1998 జూలై 18న జన్మించగా, 2002లో అతనికి సుమారు నాలుగేళ్ల వయసు మాత్రమే. అభిషేక్ శర్మ 2000 సెప్టెంబర్ 4న జన్మించాడు. అంటే ఆ సమయంలో అతనికి కేవలం రెండేళ్లే.

Advertisement