ఐపీఎల్ 2023లో బౌలర్ల హవా మామూలుగా లేదుగా.. లిస్టులో ఎవరున్నారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2023లో బౌలర్లు అదరగొట్టాడు. కీలక మ్యాచుల్లో సత్తా చాటి మ్యాచ్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఈ సీజన్ లో బౌలర్లు సాధించిన రికార్డులు ఓసారి చూద్దాం.
గుజరాత పేసర్ మహమ్మద్ షమీ పవర్ ప్లేలో 15 వికెట్లను తీసి అదరగొట్టాడు. ముఖ్యంగా 14 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా ఈ సీజన్లో అత్యధిక డాట్ బాల్స్(172) వేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఈ ఐపీఎల్ లో తొలి హ్యాట్రిక్ వికెట్లు సాధించిన ఆటగాడిగా రషీద్ ఖాన్ చరిత్రకెక్కాడు. రషీద్ 7.82 ఎకానమీతో 24 వికెట్లు సాధించాడు. మిడిల్ ఓవర్లలో (7-16) 16 వికెట్లు తీసి గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Details
ఐపీఎల్ లో అదరొట్టిన బౌలర్లు
యుజ్వేంద్ర చాహల్ 14 మ్యాచ్‌ల్లో 20.57 సగటుతో 21 వికెట్లను తీశాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు (187) తీసిన బౌలర్‌గా చాహల్ నిలిచాడు.
ముంబై వెటరన్ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా లేటు వయస్సులో సత్తా చాటాడు. 7.81 ఎకానమీతో 20 వికెట్లు తీసి చెలరేగాడు. ముంబై ప్లేఆఫ్స్‌కు వెళ్లడానికి అతను కృషి చేశాడు. చావ్లా మిడిల్ ఓవర్లలో (7-16) 18 వికెట్లు తీయడం గమనార్హం.
తుషార్ దేశ్‌పాండే 20 వికెట్లతో ఐపీఎల్ కేరీర్ ను ఘనంగా ప్రారంభించాడు. డెత్ ఓవర్లలో (17-20) ఎనిమిది వికెట్లతో రాణించాడు.
మతీషా పతిరానా, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ తమ బంతుల్లో ప్రత్యర్థులకు దడ పుట్టించారు.