Page Loader
IPL 2023: లీగ్‌ దశలో అదరగొట్టిన టాప్ బ్యాట్స్‌మెన్స్ వీరే..!
ఈ సీజన్లో 680 రన్స్ చేసిన గిల్

IPL 2023: లీగ్‌ దశలో అదరగొట్టిన టాప్ బ్యాట్స్‌మెన్స్ వీరే..!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 23, 2023
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2023 లీగ్ స్టేజ్ ముగిసింది. నేటి నుంచి ఫ్లే ఆఫ్స్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో లీగ్ స్టేజ్ లో అంచనాలకు మించి బ్యాటర్లు రాణించారు. ఆరెంజ్ క్యాప్ కోసం ఈ సీజన్లో గట్టి పోటీ ఏర్పడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 14 మ్యాచుల్లో 56.15 సగటుతో 730 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. అత్యధికంగా ఎనిమిది అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. గుజరాత్ టైటాన్స్ విజయంలో శుభ్‌మాన్ గిల్ కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో 56.66 సగటుతో 680 పరుగులు చేశాడు. ఇందులో బ్యాక్ టు బ్యాక్ రెండు సెంచరీలు బాదడం విశేషం.

Details

ఐపీఎల్ లో ఏడు సెంచరీలు నమోదు చేసిన విరాట్ కోహ్లీ

ఈ ఏడాది విరాట్ కోహ్లి 2 సెంచరీలు చేశాడు. దీంతో ఐపీఎల్లో మొత్తం 7 సెంచరీలతో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. కోహ్లి 14 మ్యాచ్‌ల్లో 53.25 సగటుతో 639 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 625 రన్స్ చేశాడు. ఒక సీజన్ లో అంతర్జాతీయ క్రికెట్ ఆడని ప్లేయర్ చేసిన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. రింకూ సింగ్ (17-20) డెత్ ఓవర్లలో ఏకంగా 239 పరుగులతో సత్తా చాటాడు. గుజరాత్ జరిగిన మ్యాచులో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో 474 రన్స్ చేశాడు. డెవాన్ కాన్వే 53.18 సగటుతో 585 పరుగులతో రాణించాడు.