
ఐపీఎల్ 2023లో సిక్సర్ల మోత.. అత్యధిక సిక్సర్ల రికార్డు బద్దలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో బ్యాటర్లు సిక్సర్ల మోత మోగించారు. ఈ సీజన్లో ఇప్పటికే 200 కు స్కోర్లు నమోదు కావడంతో బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురిపించారు.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు నమోదైన సీజన్‌గా 2023 నిలవడం విశేషం. ఇంకా ఫ్లే ఆఫ్స్ మ్యాచులు మిగిలి ఉండగానే సిక్సర్ల రికార్డు బద్దలు కావడం గమనార్హం.
ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, గుజరాత్ మధ్య జరిగిన చివరి లీగ్ మ్యాచులో ఈ రికార్డు బ్రేక్ అయింది. గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కొట్టిన సిక్స్ తో ఈ రికార్డు క్రియేట్ అయింది.
అతను 70వ మ్యాచులో 1063వ సిక్స్ బాదాడు. దీంతో 2022లో నమోదైన 1062 సిక్సర్ల రికార్డు ప్రస్తుతం బ్రేక్ అయింది.
Details
అత్యధిక సిక్సర్లు బాదిన డుప్లెసిస్
ఫ్లేఆఫ్స్ మ్యాచులు మిగిలి ఉండటంతో ఈ సిక్సర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇక రేపటి నుంచి ఫ్లేఆఫ్స్ మ్యాచులు జరగనున్నాయి.
గుజరాత్ టైటాన్స్ వర్సస్ చైన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ వర్సస్ ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి.
ఐపీఎల్ లో గతేడాది తొలిసారిగా వెయ్యికి పైగా సిక్స్ లు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పుడు వరుసగా రెండో ఏడాది కూడా వెయ్యికి పైగా సిక్స్ లు నమోదయ్యాయి.
ఈ సీజన్లో డుప్లెసిస్ 36 సిక్సర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 33 సిక్స్‌లతో రెండో స్థానంలో శివం దూబే నిలిచాడు.