Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడో మెడల్.. షూటింగ్ విభాగంలో కాంస్యం
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో పతకాలను సాధిస్తున్నారు. తాజాగా పురుషుల రైఫిల్ 50 మీటర్ల 3-పొజిషన్స్ ఈవెంట్‌లో భారత్ షూటర్ స్వప్నిల్ కుసాలే సత్తా చాటారు. ఫైనల్లో 451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుపొందారు. దీంతో ఇండియా ఖాతాలో మూడో కాంస్యం చేరింది. చైనా ప్లేయర్ లియూ (463.6) స్వర్ణం, ఉక్రెయిన్ ప్లేయర్ కులిశ్ (461.3) వెండి పతకాన్ని గెలిచారు. వ్యవసాయ కుటుంబం నుంచి కుసాలే పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య సాధించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్వప్నిల్ కుసాల్ సాధించిన ఘనతలివే
స్వప్నిల్ కుసాల్ 1995 ఆగస్టు 6న పూణేలో జన్మించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అతను 2009లో మహారాష్ట్రలోని క్రీడా ప్రభోదిని అనే ప్రాథమిక క్రీడా కార్యక్రమంలో అతని ప్రయాణం మొదలైంది. అతని ప్రతిభతో 2013లో లక్ష్య స్పోర్ట్స్ నుండి స్పాన్సర్ షిప్‌ను కూడా పొందాడు. ఇక 2015లో కువైటులో జరిగిన ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్‌లో 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ 3 ఈవెంట్‌లో స్వర్ణం సాధించాడు.