IND VS SA: టీమిండియాలో ఆ ఇద్దరే కీలకం : దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ షాన్ పొలాక్
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశను టేబుల్‌టాపర్‌గా భారత్ ఘనంగా ముగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సూపర్ 8లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్‌లో టీమిండియా, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి ఈ కీలక మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ షాన్ పొల్లాక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇరు జట్లలోనూ అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నారని పొలాక్ పేర్కొన్నాడు. క్వింటాన్ డికాక్, అభిషేక్ శర్మతో సమానంగా పోటీ పడగలడని అన్నాడు. అలాగే ఆడమ్ మార్క్రమ్ ఎవరితోనైనా తలపడగల సామర్థ్యం ఉన్న బ్యాటర్ అని అభిప్రాయపడ్డాడు. అయితే ఇరు జట్ల లైనప్‌ను పరిశీలిస్తే తేడా సృష్టించగల ఆటగాళ్లు మాత్రం జస్పిత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి అని స్పష్టం చేశాడు.
Details
డెత్ ఓవర్లలో బూమ్రా బౌలింగ్ అద్భుతం
దక్షిణాఫ్రికా జట్టు నాణ్యతపై సందేహం లేదని, ముఖ్యంగా బౌలింగ్‌లో వారు బలంగా ఉన్నారని పొలాక్ అన్నాడు. అయినప్పటికీ బుమ్రా అసాధారణ ఫాస్ట్ బౌలర్ అని కొనియాడాడు. పవర్‌ప్లేలో కొత్త బంతితో ప్రభావం చూపగలడని, ఇన్నింగ్స్ మధ్యలోనూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలడని, ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతడి బౌలింగ్ అత్యంత ప్రమాదకరమని విశ్లేషించాడు. అలాగే మిడిల్ ఓవర్లలో వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషిస్తాడని పొలాక్ పేర్కొన్నాడు. క్రీజులో లెఫ్ట్ హ్యాండర్ ఉన్నా, రైట్ హ్యాండర్ ఉన్నా ఎలాంటి తేడా లేకుండా సమర్థంగా బౌలింగ్ చేయగలడని చెప్పాడు. ఈ ఇద్దరు బౌలర్ల కారణంగానే టీమ్‌ఇండియా బౌలింగ్ విభాగం తమ జట్టుతో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉందని షాన్ పొలాక్ అభిప్రాయపడ్డాడు.