LOADING...
IND vs PAK : భారత్, పాక్ మ్యాచ్ లేకుండానే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ
భారత్, పాక్ మ్యాచ్ లేకుండానే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ

IND vs PAK : భారత్, పాక్ మ్యాచ్ లేకుండానే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2025
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-పాకిస్థాన్ జట్లు ఏ టోర్నమెంట్‌లోనైనా ఎదురెదురయ్యాయి అంటే, ఆ మ్యాచ్‌లపై ఉండే ఉత్సాహం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ మండలి) కూడా ఈ రెండు జట్లను ఒకే గ్రూప్‌లో పడేలా షెడ్యూల్‌లను రూపొందించే పద్దతిని కొనసాగిస్తోంది. కానీ తాజాగా విడుదల చేసిన అండర్-19 ప్రపంచకప్ షెడ్యూల్‌లో మాత్రం ఈ రెండు దేశాలు వేర్వేరు గ్రూపుల్లో ఉండటం గమనార్హం. 2026 జనవరి-ఫిబ్రవరిలో జరగబోయే అండర్-19 ప్రపంచకప్‌కు సంబంధించి మ్యాచ్‌లు రెండు దేశాల్లోని ఐదు వేదికలపై జరగనున్నాయి. జింబాబ్వే, నమీబియా ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యమివ్వబోతున్నాయి.

వివరాలు 

మొత్తం 16 జట్లు.. గ్రూప్‌లో నాలుగు జట్లు 

మొత్తం 16 జట్లు పాల్గొంటుండ‌గా, వాటిని నాలుగు గ్రూపులుగా - ప్రతి గ్రూప్‌లో నాలుగు జట్లు - విభజించారు. గ్రూప్ Aలో భారత జట్టుతో పాటు అమెరికా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. గ్రూప్ Bలో జింబాబ్వే, పాకిస్తాన్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్ ఉన్నాయి. గ్రూప్ Cలో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జపాన్, శ్రీలంక ఉండగా... గ్రూప్ Dలో టాంజానియా, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. ఈ మెగాటోర్నీ 2026 జ‌న‌వ‌రి 15 నుంచి ఫిబ్ర‌వ‌రి 6 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది.

వివరాలు 

టీమిండియా మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే.. 

జనవరి 15: భారత్ వ‌ర్సెస్ అమెరికా (బులవాయో) జనవరి 17: భారత్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్ (బులవాయో) జనవరి 24: భారత్ వ‌ర్సెస్‌ న్యూజిలాండ్ (బులవాయో)

వివరాలు 

ఐసీసీ అండ‌ర్‌-19 ప్రపంచ కప్ 2026 పూర్తి షెడ్యూల్ ఇదే.. 

15 జనవరి - USA వ‌ర్సెస్ ఇండియా (క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో) 15 జనవరి - జింబాబ్వే వ‌ర్సెస్ స్కాట్లాండ్ (తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, హరారే) 15 జనవరి - టాంజానియా వ‌ర్సెస్ వెస్టిండీస్ (0 HP ఓవల్, విండ్‌హోక్) 16 జనవరి - పాకిస్తాన్ వ‌ర్సెస్ ఇంగ్లాండ్ ( తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, హరారే) 16 జనవరి - ఆస్ట్రేలియా వ‌ర్సెస్ ఐర్లాండ్ ( నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్) 16 జనవరి - ఆఫ్ఘనిస్తాన్ వ‌ర్సెస్ దక్షిణాఫ్రికా ( HP ఓవల్, విండ్‌హోక్) 17 జనవరి - ఇండియా వ‌ర్సెస్ బంగ్లాదేశ్ ( క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో)

వివరాలు 

ఐసీసీ అండ‌ర్‌-19 ప్రపంచ కప్ 2026 పూర్తి షెడ్యూల్ ఇదే.. 

17 జనవరి - జపాన్ వ‌ర్సెస్ శ్రీలంక ( నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్) 18 జనవరి - న్యూజిలాండ్ వ‌ర్సెస్ USA ( క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో) 18 జనవరి - ఇంగ్లండ్ వ‌ర్సెస్ జింబాబ్వే ( తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, హరారే) 18 జనవరి - వెస్టిండీస్ వ‌ర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ( HP ఓవల్, విండ్‌హోక్) 19 జనవరి - పాకిస్తాన్ వ‌ర్సెస్ స్కాట్లాండ్ (తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, హరారే) 19 జనవరి - శ్రీలంక వ‌ర్సెస్ ఐర్లాండ్ (న‌మీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్) 19 జనవరి - దక్షిణాఫ్రికా వ‌ర్సెస్ టాంజానియా ( HP ఓవల్, విండ్‌హోక్)

వివరాలు 

ఐసీసీ అండ‌ర్‌-19 ప్రపంచ కప్ 2026 పూర్తి షెడ్యూల్ ఇదే.. 

20 జనవరి 20 - బంగ్లాదేశ్ వ‌ర్సెస్ న్యూజిలాండ్ (క్వీన్స్‌ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో) 20 జనవరి - ఆస్ట్రేలియా వ‌ర్సెస్ జపాన్ (నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్) 21 జనవరి - ఇంగ్లాండ్ వ‌ర్సెస్ స్కాట్లాండ్ ( తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, హరారే) 21 జనవరి - ఆఫ్ఘనిస్తాన్ వ‌ర్సెస్ టాంజానియా ( HP ఓవల్, విండ్‌హోక్) 22 జనవరి - జింబాబ్వే వ‌ర్సెస్ పాకిస్తాన్ ( త‌కాషింగా స్పోర్ట్స్ క్లబ్, హరారే) 22 జనవరి - ఐర్లాండ్ వ‌ర్సెస్ జపాన్ ( నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్) 22 జనవరి - వెస్టిండీస్ వ‌ర్సెస్ దక్షిణాఫ్రికా (HP ఓవల్, విండ్‌హోక్)

వివరాలు 

ఐసీసీ అండ‌ర్‌-19 ప్రపంచ కప్ 2026 పూర్తి షెడ్యూల్ ఇదే.. 

23 జనవరి - బంగ్లాదేశ్ వ‌ర్సెస్ USA (తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, హరారే) 23 జనవరి - శ్రీలంక వ‌ర్సెస్ ఆస్ట్రేలియా ( నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్) 24 జనవరి - ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ ( క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో) 24 జనవరి - A4 v D4 ( HP ఓవల్, విండ్‌హోక్) 25 జనవరి - సూపర్ సిక్స్ A1 vs D3 ( నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్ 25 జనవరి - సూపర్ సిక్స్ D2 v A3 ( HP ఓవల్, విండ్‌హోక్) 26 జనవరి - B4 v C4 ( హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే)

వివరాలు 

ఐసీసీ అండ‌ర్‌-19 ప్రపంచ కప్ 2026 పూర్తి షెడ్యూల్ ఇదే.. 

26 జనవరి - సూపర్ సిక్స్ C1 vs B2 (క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో) 26 జనవరి - సూపర్ సిక్స్ D1 vs A2 ( నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్) 27 జనవరి - సూపర్ సిక్స్ C2 vs B3 ( హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే) 27 జనవరి - సూపర్ సిక్స్ C3 vs B1 ( క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో) 28 జనవరి - సూపర్ సిక్స్ A1 vs D2 ( హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే) 29 జనవరి - సూపర్ సిక్స్ D3 vs A2 ( క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో)

వివరాలు 

ఐసీసీ అండ‌ర్‌-19 ప్రపంచ కప్ 2026 పూర్తి షెడ్యూల్ ఇదే.. 

30 జనవరి - సూపర్ సిక్స్ D1 vs A3 ( హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే) 30 జనవరి - సూపర్ సిక్స్ B3 vs C1 ( క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో) 31 జనవరి - సూపర్ సిక్స్ B2 vs C3 ( హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే) 01 ఫిబ్రవరి - సూపర్ సిక్స్ B1 vs C2 ( క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో) 03 ఫిబ్రవరి - మొదటి సెమీ-ఫైనల్ (క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో) 04 ఫిబ్రవరి - రెండవ సెమీ-ఫైనల్ ( హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే) 06 ఫిబ్రవరి - ఫైనల్ ( హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే)