Loading...
ISSF World Cup: షూటింగ్‌ ప్రపంచకప్‌లో ఉదయ్‌వీర్‌ స్వర్ణం.. చివరి షాట్లతో సంచలనం!
షూటింగ్‌ ప్రపంచకప్‌లో ఉదయ్‌వీర్‌ స్వర్ణం.. చివరి షాట్లతో సంచలనం!

ISSF World Cup: షూటింగ్‌ ప్రపంచకప్‌లో ఉదయ్‌వీర్‌ స్వర్ణం.. చివరి షాట్లతో సంచలనం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2026
09:12 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో భారత షూటర్‌ ఉదయ్‌వీర్‌ సిద్ధు అదరగొట్టాడు. ఆదివారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన 24 ఏళ్ల ఉదయ్‌వీర్‌ 240.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. జర్మనీ షూటర్‌ క్రిస్టియన్‌ రీజ్‌ 240.1 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. అయితే కేవలం 0.5 పాయింట్ల తేడాతో ఉదయ్‌వీర్‌ విజయం సాధించడం విశేషం. చివరి రెండు షాట్లకు ముందు అతడు 0.3 పాయింట్ల వెనుకంజలో ఉన్నాడు.

వివరాలు

చివరి షాట్లే ఫలితాన్ని నిర్ణయించాయి

తీవ్ర ఒత్తిడి నెలకొన్న కీలక సమయంలోనూ గురి తప్పకుండా షూటింగ్‌ చేసి స్వర్ణ పతక పోటీలో నిలిచాడు. ఆఖరి రెండు షాట్లలో వరుసగా 10.2, 9.8 పాయింట్లు సాధించి అద్భుతంగా పుంజుకున్నాడు.

మరోవైపు జర్మనీ షూటర్‌ క్రిస్టియన్‌ రీజ్‌ చివరి రెండు ప్రయత్నాల్లోనూ 9.6 పాయింట్ల చొప్పున మాత్రమే సాధించాడు.

దీంతో ఉదయ్‌వీర్‌ స్వల్ప ఆధిక్యంతో విజయం ఖరారు చేసుకుని స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఫైనల్లో చివరి షాట్లే ఫలితాన్ని నిర్ణయించాయి.

విజయం ఖరారు కావడంతో ఉదయ్‌వీర్‌ సంబరాల్లో మునిగిపోయాడు. ఈ విభాగంలో పావోలో మోనా 219.8 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.

ADVERTISEMENT