Page Loader
US Open 2023: మూడో రౌండ్‌కి దూసుకెళ్లిన నొవాక్ జకోవిచ్, కరోలినా ముచోవా 
మూడో రౌండ్‌కి దూసుకెళ్లిన నొవాక్ జకోవిచ్, కరోలినా ముచోవా

US Open 2023: మూడో రౌండ్‌కి దూసుకెళ్లిన నొవాక్ జకోవిచ్, కరోలినా ముచోవా 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 31, 2023
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ అద్భుత ప్రదర్శనతో అకట్టుకున్నాడు. ఏడాది తర్వాత యూఎస్ బరిలోకి దిగిన జకోవిచ్ 6-4, 6-1, 6-1తో స్పెయిన్‌కు చెందిన బెర్నాబ్ జపాటా మిరాలెస్‌ను ఓడించాడు. దీంతో పురుషుల సింగిల్స్ లో జకోవిచ్ మూడో రౌండ్ కు అర్హత సాధించాడు. దాదాపు రెండు గంటల పాటు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచులో చివరికి జకోవిచ్ నే విజయం వరించింది. జొకోవిచ్ మెదట్లో కాస్త తడబడినా, చివరి రెండు సెట్లలో అద్భుతంగా రాణించాడు. మరోవైపు జకోవిచ్ తనకు లభించిన 11 బ్రేక్ పాయింట్లలో ఆరింటిని మార్చగలిగాడు.

Details

మాగ్డలీనా ఫ్రెచ్‌ ను ఓడించిన కరోలినా ముచోవా

మహిళల సింగిల్స్‌లో 2023 ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ కరోలినా ముచోవా 6-3, 6-3తో మాగ్డలీనా ఫ్రెచ్‌ను ఓడించింది. గంటా 19 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ముచోవా అద్భుత ఫామ్‌ను ప్రదర్శించింది. ముచోవా, ఫ్రెచ్‌కి తన సర్వ్‌ను బ్రేక్ చేయడానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకపోవడం గమనార్హం. మరోవైపు ముచోవా నాలుగు బ్రేక్ పాయింట్లలో మూడింటిని మార్చగలిగింది. ముచోవా తన మొదటి సర్వ్‌లతో అద్భుతంగా రాణించి, 80 పాయింట్లను గెలుచుకుంది.