Page Loader
Arina Sabalenka: యూఎస్‌ ఓపెన్‌ 2024 విజేతగా సబలెంక.. ఫైనల్లో జెసికాపై విజయం
యూఎస్‌ ఓపెన్‌ 2024 విజేతగా సబలెంక.. ఫైనల్లో జెసికాపై విజయం

Arina Sabalenka: యూఎస్‌ ఓపెన్‌ 2024 విజేతగా సబలెంక.. ఫైనల్లో జెసికాపై విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 08, 2024
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో జరుగుతున్న యూఎస్ ఓపెన్ 2024 టెన్నిస్ టోర్నమెంట్‌లో బెలారస్‌కు చెందిన అరీనా సబలెంక అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మహిళల సింగిల్స్ ఫైనల్‌లో సబలెంక అమెరికన్ క్రీడాకారిణి జెసికా పెగులాపై 7-5, 7-5 స్కోరుతో గెలిచింది. దీంతో తన తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. సబలెంక తన జీవితంలోని కఠిన పరిస్థితులను గుర్తుచేసింది. ఐదేళ్ల క్రితం తన తండ్రిని, ఈ ఏడాది మార్చిలో బాయ్‌ఫ్రెండ్‌ను కోల్పోయినట్లు సబలెంక పేర్కొంది. టెన్నిస్‌లో తన కుటుంబ పేరును చరిత్రలో నిలబెట్టాలని నిర్ణయించుకున్నానని, ప్రతిసారీ తన పేరు ఈ ట్రోఫీపై కనిపించినప్పుడు తన కుటుంబం గర్వపడుతుందని సబలెంక భావోద్వేగంగా తెలిపింది.