Page Loader
భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు అమెరికా ఆతిథ్యం..!
భారత్, పాక్ మ్యాచ్‌కు అతిథ్యం ఇవ్వనున్న అమెరికా

భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు అమెరికా ఆతిథ్యం..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 19, 2023
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఐసీసీ కీలకమైన మార్పులు చేసింది. టీ20 ప్రపంచ కప్ 2024 కి సంబంధించి అమెరికా క్రికెట్‌ అధ్యక్షుడు అతుల్‌ రాయ్‌ కీలక విషయాన్ని వెల్లడించారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఓక్లాండ్, ఫ్లోరిడా, లాస్ ఏంజెల్స్ లోని వేదికలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 2024లో జరిగే ఈ టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. దీంతో భారత్-పాకిస్థాన్ పోరుకు అమెరికా ఆతిథ్యమిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది . 2024 టీ20 ప్రపంచకప్‌లో ఏకంగా 20 జట్లు పాల్గొనబోతున్నాయి ఫ్లోరిడాలో వెస్టిండీస్‌తో భారత్ ఆడిన T20 మ్యాచ్‌లు పూర్తిగా అమ్ముడుపోయాయని, కావున USAలో నిర్వహించడం మంచిదని అతుల్ రాయ్ పేర్కొన్నారు.

భారత్

పెద్ద బౌండరీలతో కూడిన మైదానం అవసరం

USAలోని చాలా మైదానాలు బేస్‌బాల్‌కు తగ్గట్టుగా ఉండటంతో మైదానాలు తక్కువ కొలతలతో ఉంటాయని రాయ్ తెలిపారు. ఏంజిల్స్‌లోని మైదానంలో ఇండియా, ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌లు ఆడిందని ఇది పెద్ద బౌండరీలతో కూడిన సరైన క్రికెట్ మైదానం అని ఆయన వెల్లడించారు. భారత్-పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ పోరుకు అమెరికా ఆతిథ్యమివ్వడం గమనార్హం. 2022లో MCGలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ పాకిస్థాన్‌ను ఓడించింది. పాకిస్థాన్‌పై 13వ ప్రపంచకప్ విజయం సాధించి 2021 ఈవెంట్‌లో జరిగిన ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.