IND vs PAK: ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు.. రద్దైతే ఎవరికెంత లాభం?
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ జట్లు కొలంబోలోని ఆర్. ప్రేమదాస్ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. అయితే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ వర్షం కారణంగా ఆట రద్దయితే ఏమవుతుందన్న దానిపై అభిమానుల్లో చర్చ సాగుతోంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. అందువల్ల వర్షం వల్ల ఆట పూర్తిగా రద్దయితే మరుసటి రోజు నిర్వహించే అవకాశం లేదు. దీంతో అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు. వర్షం పడకూడదని ఆశిస్తున్నారు. ఈ మెగా టోర్నీలో సెమీఫైనల్స్, ఫైనల్‌కు మాత్రమే రిజర్వ్ డే కేటాయించారు.
Details
చెరో పాయింట్
ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే భారత్, పాక్ జట్లకు తలో పాయింట్ చొప్పున లభిస్తుంది. ఇప్పటికే ఇరు జట్లు రెండు మ్యాచ్‌లు గెలిచి నాలుగు పాయింట్లతో ఉన్నాయి. ఈ మ్యాచ్ రద్దయితే వారి మొత్తం పాయింట్లు ఐదుకు చేరతాయి. గ్రూప్-ఏలోని మిగతా జట్ల పరిస్థితి చూస్తే, యూఎస్‌ఏ మరియు నెదర్లాండ్స్ మూడు మ్యాచ్‌లు ఆడి ఒక్కో మ్యాచ్ గెలిచి తలో రెండు పాయింట్లతో ఉన్నాయి. నమీబియా రెండు మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ ఓడిపోయి సున్నా పాయింట్లతో కొనసాగుతోంది.
Details
తప్పని నష్టం
కొద్ది రోజుల క్రితం వరకు భారత్‌తో మ్యాచ్ ఆడమని పాకిస్థాన్ ప్రకటించింది. అయితే ఐసీసీ హెచ్చరికలతో పాక్ వెనక్కి తగ్గి మ్యాచ్‌కు అంగీకరించింది. ప్రస్తుతం అన్నీ సజావుగానే ఉన్నాయనుకుంటున్న వేళ, వరుణుడు అందరి ఆశలపై నీళ్లు చల్లేలా కనిపిస్తున్నాడు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే బ్రాడ్‌కాస్టర్లు భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే శ్రీలంక క్రికెట్ బోర్డుకు టికెట్ల రూపంలో వచ్చే ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉంది.