LOADING...
ICC ODI Rankings: టీ20,టెస్ట్,వన్డే ర్యాంకింగ్స్.. నం.1 బ్యాటర్‌గా డారిల్‌ మిచెల్.. రెండో స్థానంలో కోహ్లీ
నం.1 బ్యాటర్‌గా డారిల్‌ మిచెల్.. రెండో స్థానంలో కోహ్లీ

ICC ODI Rankings: టీ20,టెస్ట్,వన్డే ర్యాంకింగ్స్.. నం.1 బ్యాటర్‌గా డారిల్‌ మిచెల్.. రెండో స్థానంలో కోహ్లీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2026
03:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ నంబర్ 1 స్థానాన్ని ఆక్రమించాడు. అతని ఖాతాలో 845 పాయింట్లు ఉన్నాయి. ఇంతక్రితం ర్యాంకింగ్‌లో మొదటి స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ 795 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో నిరాశాజనక ప్రదర్శన చూపిన రోహిత్ శర్మ మూడో స్థానం నుండి నాల్గో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతానికి అతని ఖాతాలో 757 పాయింట్లు ఉన్నాయి. మూడో స్థానంలో 764 పాయింట్లతో అఫ్గానిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ నిలిచాడు. శుభమన్ గిల్ 723 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్ 670 పాయింట్లతో పదో స్థానంలో, శ్రేయస్ అయ్యర్ 656 పాయింట్లతో 11వ స్థానంలో కొనసాగుతున్నారు.

వివరాలు 

నాలుగు సంవత్సరాల తర్వాత నం.1 ర్యాంక్

ఇటీవల భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో, న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ 176.00 యావరేజ్‌తో మొత్తం 352 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు (137, 131),ఒక హాఫ్ సెంచరీ (84) ఉన్నాయి. విరాట్ కోహ్లీ 80.00 యావరేజ్‌తో 240 పరుగులు చేశాడు, ఇందులో ఒక సెంచరీ (124),ఒక హాఫ్ సెంచరీ (93) ఉన్నాయి. రెండో మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా జరిగినప్పుడు కోహ్లీ 24 పరుగులకే అవుట్ అయ్యాడు. నాలుగు సంవత్సరాల తర్వాత నంబర్ 1 ర్యాంక్‌ను తిరిగి పొందిన కోహ్లీ కొన్ని రోజులలోనే రెండో స్థానానికి చేరాడు.

వివరాలు 

టీ20 ర్యాంకింగ్స్

టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ 908 పాయింట్లతో మొదటి స్థానంలో, తిలక్ వర్మ 805 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 880 పాయింట్లతో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. యశస్వి జైస్వాల్ 750 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో, శుభ్మన్ గిల్ 730 పాయింట్లతో పదో స్థానంలో ఉన్నారు. టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా 879 పాయింట్లతో, టీ20ల్లో వరుణ్ చక్రవర్తి 804 పాయింట్లతో, వన్డేలలో రషీద్ ఖాన్ 710 పాయింట్లతో మొదటి స్థానాల్లో నిలిచారు.

Advertisement