IND vs AUS:విరాట్ కోహ్లీ క్యాచ్‌ల్లో 'ట్రిపుల్ సెంచరీ'
ఈ వార్తాకథనం ఏంటి
అహ్మదాబాద్ వేదికగా ఇండియా- ఆస్ట్రేలియా నాలుగో టెస్టు రికార్డులకు వేదికగా మారింది. రెండు రోజుల్లోనే బోలెడు రికార్డులు నమోదయ్యాయి. ఇందులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనతను సాధించాడు.
34 పరుగులు చేసిన నాథన్ లియాన్ క్యాచ్ ను అందుకొని విరాట్ కోహ్లీ ఈ ఫీట్‌ను సాధించారు. అంతర్జాతీయ క్రికెట్లో 300 క్యాచ్‌లను రెండో ప్లేయర్ చరిత్రకెక్కాడు. విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో వన్డే-టెస్టు, టీ-20తో కలిపి ఇప్పటి వరకు 494 మ్యాచ్‌లను ఆడాడు.
అంతకముందు రాహుల్ ద్రావిడ్ తన కెరీర్‌లో 334 క్యాచ్‌లను మొదటి స్థానంలో నిలిచాడు. అయితే అత్యంత వేగంగా 300 క్యాచ్‌లు అందుకున్న క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు.
టీమిండియా
టీమిండియా ముందు భారీ టార్గెట్
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా 480 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఉస్మాన్ ఖావాజా 180 పరుగులు, గ్రీన్ 114 పరుగులతో విజృభించడంతో ఆసీసీ ఇండియా ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది.
టీమిండియా బౌలర్లలో అశ్విన్ 6 వికెట్లు, షమీ రెండు వికెట్లు, జడేజా, అక్షర్ పటేల్ తలో ఓ వికెట్ తీశారు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 17 పరుగులు, శుభ్‌మన్ గిల్ 18 పరుగులు చేశారు. టీమిండియా 444 పరుగుల వెనుకంజలో ఉంది