INDvsAUS : మళ్లీ నిరాశపరిచిన విరాట్ కోహ్లీ.. నిరుత్సాహంలో ఫ్యాన్స్
ఈ వార్తాకథనం ఏంటి
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా ఆస్ట్రేలియా తరుపున అరంగేట్రం చేసిన టాడ్ మార్ఫీ తొలి టెస్టులోనే ఆకట్టుకున్నాడు. ఢిల్లీ టెస్టులో ఫర్వాలేదనిపించాడు. నిన్నమెన్నటి వరకు ఆస్ట్రేలియా క్రికెట్ లో పెద్దగా ఎవరికి తెలియని పేరు టాడ్ మార్ఫీ. ఇప్పుడు విరాట్ కోహ్లీని వరుసగా మూడుసార్లు అవుట్ చేసిన మర్ఫీ ఆసీస్‌లో స్టార్ ప్లేయర్ అయిపోయాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో విరాట్ కోహ్లీ 52 బంతుల్లో 22 పరుగులు చేసి నిరాశపరిచాడు. టాడ్ మార్ఫీ బౌలింగ్‌లో కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడు ఇలా కొత్త బౌలర్‌కు వరుసగా ప్రతి మ్యాచ్‌లో వికెట్ ఇచ్చుకోవడం అభిమానులు అస్సలు నచ్చడం లేదు.
విరాట్ కోహ్లీ
టెస్టులో పేలవ ప్రదర్శనపై కోహ్లీపై విమర్శలు
టెస్టుల్లో సెంచరీ లేకుండానే కోహ్లి 40 ఇన్నింగ్స్‌లు ఆడాడు. గత 14 ఇన్నింగ్స్‌లలో 50 పరుగుల మార్కును కూడా టచ్ చేయలేకపోయాడు. టెస్టులో పేలవంగా రాణించడంతో ప్రస్తుతం కోహ్లీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
2019లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో కోహ్లీ తన చివరి టెస్టు సెంచరీని సాధించాడు. అప్పటి నుంచి అతను ఆరు అర్ధసెంచరీలను సాధించాడు. చివరి ఎనిమిది టెస్టులో వరుసగా 1, 19*, 24, 1, 12, 44, 20, 22 పరుగులను మాత్రమే చేశాడు
ఆస్ట్రేలియా తరుపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన మర్ఫీ, నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీని మూడుసార్లు అవుట్ చేశాడు. ఓవరాల్‌గా 103 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి 36 సార్లు ఆఫ్‌స్పిన్నర్ల బౌలింగ్ అవుట్ అయ్యాడు.