Page Loader
తగ్గేదేలే అంటున్న ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ
ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 29 వికెట్లు తీసిన టాడ్ మర్ఫీ

తగ్గేదేలే అంటున్న ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 08, 2023
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్ వేదికగా మొదటి టెస్టు ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాన్ ఆఫ్ స్పిన్నర్ టాడ్ మార్ఫీ తన బౌలింగ్‌లో ప్రత్యర్థుల బ్యాటర్లకు ఇబ్బంది పెట్టే సత్తా ఉంది. టాడ్ మార్ఫీ మొదటిసారిగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టెస్టు అరంగేట్రం చేయనున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన నాథన్ లియాన్ ఇప్పటికే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం ఆఫ్ స్పిన్నర్ టాడ్ మార్ఫీ జతకట్టడంతో ఆస్ట్రేలియా స్పిన్ విభాగంలో బలం పుంజుకుంది. దేశీయ క్రికెట్‌లో విక్టోరియా తరపున ఆడుతున్న మర్ఫీ ఇప్పటి వరకు 14 లిస్ట్ A, ఏడు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో ఆడాడు.

టాడ్ మర్ఫీ

మొదటి టెస్టు ఆడనున్న టాడ్ మర్ఫీ..?

మర్ఫీ 2021లో సౌత్ ఆస్ట్రేలియాపై ఎఫ్‌సీ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి అతను ఏడు మ్యాచ్‌ల్లో 29 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు మూడుసార్లు, నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. 2019-20 నుండి ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో కుడిచేతి వాటం బ్యాటర్‌పై మర్ఫీ సగటు 26.70 ఉంది. అయితే ఎడమచేతి వాటం బ్యాటర్లపై ఆయన ప్రభావం చూపగలడు. మర్ఫీ బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ తరపున ఆడతాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లలో 20.33 సగటుతో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా చివరిసారిగా 2014-15లో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్‌ను ఓడించిన విషయం తెలిసిందే. పేసర్లు మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్‌లు మొదటి టెస్ట్‌కు దూరంగా ఉండటంతో మర్ఫీ ఎంపికకు దారులు తెరుచుకున్నాయి.