Loading...
VVS Lakshman: మళ్లీ వీవీఎస్ లక్ష్మణ్‌కే అవకాశం.. కేంద్రం ఆమోదం
మళ్లీ వీవీఎస్ లక్ష్మణ్‌కే అవకాశం.. కేంద్రం ఆమోదం

VVS Lakshman: మళ్లీ వీవీఎస్ లక్ష్మణ్‌కే అవకాశం.. కేంద్రం ఆమోదం

వ్రాసిన వారు Moogati Shabari
Sep 03, 2026
05:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న ఆసియా క్రీడల్లో (Asian Games 2026) టీమిండియా బరిలోకి దిగనుంది. భారత జట్టు నేరుగా క్వార్టర్‌ఫైనల్‌లో తలపడనుంది. జపాన్‌ వేదికగా ఈ క్రీడలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియాతో పాటు కోచ్‌గా వెళ్లేందుకు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు మరోసారి అవకాశం దక్కింది. ఈ మేరకు కేంద్ర క్రీడల శాఖ ఆమోదం తెలిపింది. కోచ్‌లు, సపోర్ట్‌ స్టాఫ్‌ జాబితాలో వీవీఎస్ లక్ష్మణ్‌ పేరు కూడా ఉంది. టీమ్‌ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ స్థానంలో లక్ష్మణ్‌ ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇదే సమయంలో భారత జట్టు వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో తలపడనుంది. దీంతో గంభీర్‌ స్వదేశంలోనే ఉండనున్నట్లు బీసీసీఐ తెలిపింది.

వివరాలు

లక్ష్మణ్‌ టీమ్ ఇదీ..

ఆసియా క్రీడలకు లక్ష్మణ్‌ కోచ్‌గా వెళ్లడం ఇది వరుసగా రెండోసారి.

2023లో చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లోనూ ఆయనే టీమ్‌ఇండియాకు మార్గదర్శకుడిగా వ్యవహరించాడు.

ఆ టోర్నీలో భారత జట్టు బంగారు పతకం సాధించింది. ఆ తర్వాత కూడా పలు సిరీస్‌లకు గౌతమ్ గంభీర్‌ స్థానంలో లక్ష్మణ్‌ కోచ్‌గా వ్యవహరించాడు.

ఈసారి ఆసియా క్రీడల కోసం లక్ష్మణ్‌ కోచింగ్‌ బృందంలో మాజీ క్రికెటర్లు సునీల్ జోషి, హృషికేశ్‌ కనిత్కర్‌, శుభదీప్‌ ఘోష్‌కు చోటు దక్కింది.

మరూఫ్‌ ఫజందార్‌ను టీమ్‌ లీడర్‌గా కేంద్రం నియమించింది.

వివరాలు

కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..

ఇప్పటికే ఆసియా క్రీడల కోసం భారత టీ20 జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.

శ్రేయస్ అయ్యర్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అతడికి డిప్యూటీగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు అవకాశం దక్కింది.

జట్టులో వైభవ్‌ సూర్యవంశీ, జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఉన్నారు. ఆసియా క్రీడల చరిత్రలో అతిపిన్న వయస్కుడైన క్రికెటర్‌గా వైభవ్‌ సూర్యవంశీ నిలిచాడు.

మరోవైపు భారత మహిళల జట్టు కూడా ఆసియా క్రీడల్లో బరిలోకి దిగనుంది. హెడ్‌ కోచ్ అమోల్ ముజుందార్‌, అవిష్కార్ సాల్వి నేతృత్వంలో భారత అమ్మాయిల జట్టు టోర్నీలో పాల్గొననుంది.

ADVERTISEMENT