Page Loader
సచిన్, అజయ్ జడేజా, సిద్దూని సెడ్జింగ్ చేయమని పాక్ మేనేజ్‌మెంట్ చెప్పింది
సెడ్జింగ్‌పై కీలక విషయాలను వెల్లడించిన బాసిత్ అలీ

సచిన్, అజయ్ జడేజా, సిద్దూని సెడ్జింగ్ చేయమని పాక్ మేనేజ్‌మెంట్ చెప్పింది

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2023
02:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే కోట్లాది మంది అభిమానులు అతృతగా ఎదురుచూస్తారు. ఇక దాయాది దేశాలుగా ముద్ర‌ప‌డ్డ భార‌త్‌, పాకిస్థాన్‌ మ్యాచ్ జరిగితే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రికెట్ ల‌వ‌ర్స్ టీవీల‌కు అతుక్కుపోతారు. ముఖ్యంగా భారత్, పాక్ మ్యాచ్‌లో సెడ్జింగ్ ఒక్కోసారి హై ఓల్టేజిగా పెంచేస్తుంది. ఒకరిపై ఒకరు సెడ్జింగ్ చేసుకుంటూ ఆటపై మక్కువను మరింత పెంచేస్తారు. ప్రస్తుతం సెడ్జింగ్‌పై పాక్ క్రికెటర్ కీలక విషయాలను వెల్లడించారు. సచిన్ టెండూల్కర్, అజయ్ జడేజా, నవజ్యోత్ సింగ్ సిద్దూ, వినోద్ కాంబ్లీ లాంటి ఆటగాళ్లను సెడ్జింగ్ చేయమని టీమ్ మేనేజ్ మెంట్ చెప్పిందని పాకిస్తాన్ మాజీ ప్లేయర్ బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇందులో అజారుద్దీన్‌కు మినహాయింపు ఇచ్చినట్లు ఆలీ వెల్లడించారు.

అజారుద్దీన్‌

అజర్ భాయ్‌పై గౌరవం ఉంది: మాజీ పాకిస్తాన్ ప్లేయర్

పాకిస్తాన్ డ్రెసింగ్ రూంలో భారత్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పై పాక్ ఆటగాళ్లకు గౌరవం ఉండేదని, తనని సెడ్జింగ్ చేయకూడదని తాము నిర్ణయించుకున్నామని బాసిత్ అలీ వెల్లడించారు. అజార్ బాయ్ ని మ్యాచ్ లో ఇబ్బంది పెట్టకుండా, మిగతా ఆటగాళ్లపై సెడ్జింగ్ చేయడానికి ముందుకొచ్చే వాళ్లమని, వాసిం (అక్రమ్), సలీం మాలిక్, రషీద్ లతీఫ్, ఇంజ్మామ్-ఉల్-హక్, వకార్ యూనిస్ అయినా, అజర్ భాయ్‌పై స్లెడ్జ్ చేయడానికి ధైర్యం చేసేవారు కాదని బాసిత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సెడ్జింగ్ పై కీలక విషయాలను చెప్పిన బాసిత్ అలీ