Sachin Tendulkar: ఇదే జోరును కొనసాగించాలి.. టీమిండియాకు సచిన్ టెండూల్కర్ కీలక సూచన!
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ సూపర్-8 దశలో జింబాబ్వేతో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ అద్భుత ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఇదే జోరు కొనసాగించాలని టీమ్ ఇండియాకు సూచించారు. ఎక్స్ వేదికగా స్పందించిన సచిన్, తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా సత్తా చాటింది. 256 పరుగులు చాలా భారీ స్కోరు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇదే అత్యధికం. భారత జట్టు అద్భుతంగా ఆడింది. ఇదే రిథమ్‌ను కొనసాగించాలి. ఈ టోర్నమెంట్‌లో మంచి ప్రదర్శనలు చేసిన జింబాబ్వే జట్టుకూ అభినందనలని పేర్కొన్నారు.
Details
రాణించిన భారత బ్యాటర్లు
సూపర్-8లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన భారత్, సెమీఫైనల్ అవకాశాలను కాస్త సంక్లిష్టం చేసుకుంది. అయితే జింబాబ్వేపై విజయం సాధించడం ద్వారా తన ఆశలను మళ్లీ సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ(55), హర్దిక్ పాండ్యా (50*), తిలక్ వర్మ (44*) రాణించారు. ముఖ్యంగా తిలక్ వర్మ 275 స్ట్రైక్ రేట్‌తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే ఇషాన్ కిషన్ (38), సూర్యకుమార్ యాదవ్ (33) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
Details
బౌలింగ్ విభాగంలో రాణించిన ఆర్ష్‌దీప్ సింగ్
బౌలింగ్ విభాగంలో ఆర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా రాణించాడు. నాలుగు ఓవర్లలో 24 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసి జింబాబ్వేను ఒత్తిడిలోకి నెట్టాడు. సూపర్-8లో భాగంగా టీమిండియా ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సెమీస్‌కు దూసుకుపోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.