WPL: ముగిసిన యూపీ ఇన్నింగ్స్.. ముంబయి టార్గెట్ ఎంతంటే?
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 17, 2026
04:50 pm
ఈ వార్తాకథనం ఏంటి
డబ్ల్యూపీఎల్-4లో భాగంగా ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో యూపీ వారియర్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో యూపీ జట్టు 8 వికెట్లు కోల్పోయి 187 పరుగులు సాధించింది. జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ 70 పరుగులతో అద్భుతమైన అర్ధశతకం నమోదు చేయగా, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ కూడా 61 పరుగులతో మెరిసింది. వీరిద్దరూ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ముందుకు నడిపించారు.
Details
రెండు వికెట్లు పడగొట్టిన నాట్ సివర్
మధ్యలో హర్లీన్ డియోల్ 25 పరుగులు, క్లో ట్రయాన్ 21 పరుగులు చేసి కీలక సహకారం అందించారు. ముంబయి బౌలర్లలో అమెలియా కెర్ మూడు వికెట్లు తీసి ప్రభావవంతంగా బౌలింగ్ చేయగా, నాట్ సివర్ రెండు వికెట్లు పడగొట్టింది. కేరీ, మాథ్యూస్, అమన్‌జోత్ కౌర్ తలో వికెట్ తీసి యూపీ పరుగుల వేగాన్ని కొంతవరకు కట్టడి చేశారు.