
ఐపీఎల్ 2023 సమయంలో ఏ ఫుడ్‌కు ఎక్కువ ఆర్డర్లు వచ్చాయంటే?
ఈ వార్తాకథనం ఏంటి
సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచులో ఐపీఎల్ 2023 కు తెరపడింది. గుజరాత్ టైటాన్స్ ను ఓడించి చైన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2023 క్రికెట్ అభిమానులకు కొత్త అనుభూతినిచ్చింది.
ముఖ్యంగా ధోనిసేన కప్పు గెలవడంతో అతని అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే ఐపీఎల్ సమయంలో ప్రజలు ఏ ఫుడ్ ఎక్కువగా ఆర్డర్లు లభించాయో తెలుసా? ఐపీఎల్ 2023 షెడ్యుల్ మొత్తంలో ఎక్కువ ఆర్డర్లు వచ్చిన డిష్ గా బిర్యానీ నిలిచింది.
ఓ వైపు ప్లేయర్లు ఆటతో దుమ్ములేపుతుంటే.. మరోవైపు నిమిషానికి 212 బిర్యానీలను డిష్ లవర్స్ ఆర్డర్లు పెట్టడం విశేషం.
Details
లాభాల్లో స్విగ్గి
ఆర్డర్ల విషయంలో వార్ వన్ సైడ్ అయిపోయిందని ప్రముఖ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. అయితే వెజ్ బిర్యానీని ఆర్డర్ చేశారా? లేక నాన్ వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశారా? అన్న ప్రశ్నకు స్విగ్గి సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం.
బిర్యానీకి ఇండియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2023 న్యూఈయర్ రాత్రి ఏకంగా 3.5 లక్షల బిర్యానీలు అమ్ముడుపోయాయంటే అర్ధం చేసుకోవచ్చు.
న్యూ ఇయర్ రోజు ఒక్క హైదరాబాద్ నుంచి 75.4శాతం బిర్యానీలు ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ నిర్వహించిన ట్విట్టర్ పోల్ లో వెల్లడైంది.
ఆ తర్వాతి స్థానంలో లక్నో (14.2శాతం) కోల్‌కతా (10.4) ఉన్నాయి. స్విగ్గి తొలిసారిగా ఈ మార్చిలో లాభాలను నమోదు చేసింది.