
ఐపీఎల్ ట్రోఫీని ధోనీసేన గెలిచినా.. ఎక్కువ అవార్డులు గుజరాత్‌కే సొంతం
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లో ఐపీఎల్ ట్రోఫీని చైన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలుచుకుంది. అయితే ఈ సీజన్లో రన్నరప్ గా నిలిచిన గుజరాత్ జట్టు అటగాళ్లే ఎక్కువ అవార్డులు గెలుచుకోవడం విశేషం.
ఐదోసారి టైటిల్ ను గెలుచుకొని ధోని సేన ముంబై రికార్డును సమం చేసింది. రిజర్వ్ డే నాడు చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచులో చైన్నైకి జట్టు రవీంద్ర జడేజా చిరస్మరణీయమైన విజాన్ని అందించాడు.
అయితే విజేతగా చైన్నై నిలిచినా.. ఎక్కువ అవార్డులు గుజరాత్ నే వరించాయి. ప్రస్తుతం పర్పుల క్యాప్, ఆరెంజ్ క్యాప్ విభాగాల్లో అవార్డులను ఎవరు గెలిచారో తెలుసుకుందాం.
Details
ఆరెంజ్ క్యాప్ విజేత శుభ్‌మన్ గిల్
విజేత : చెన్నై సూపర్ కింగ్స్
రన్నరప్ : గుజరాత్ టైటాన్స్
మూడో స్థానంలో నిలిచిన జట్టు : ముంబైఇండియన్స్
నాలుగో స్థానంలో నిలిచిన జట్టు : లక్నో
ఐపీఎల్ ఫెయిర్‌ప్లే అవార్డు : దిల్లీ క్యాపిటల్స్
ఆరెంజ్ క్యాప్ : శుభ్‌మన్ గిల్ 890 పరుగులు
పర్పుల్ క్యాప్ : మహమ్మద్ షమీ 28 వికెట్లు
సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది టోర్నమెంట్ : మ్యాక్స్‌వెల్ (183.49)
గేమ్ ఛేంజర్ ఆఫ్ ది టోర్నమెంట్ : శుభ్‌మన్ గిల్
ఎక్కువ ఫోర్లు కొట్టిన ఆటగాడు : శుభ్‌మన్ గిల్ (84)
ఈ టోర్నమెంట్‌లో అత్యంత విలువైన ఆటగాడు : శుభ్‌మన్‌గిల్
లాంగెస్ట్ సిక్స్ : డుప్లెసిస్ (115 మీటర్లు)
క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ : రషీద్ ఖాన్ (జీటీ)
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ : యశస్వి జైస్వాల్