చివరి ఓవర్లో టెన్షన్ పడ్డ ఎంఎస్ ధోనీ.. గెలిచాక కన్నీళ్లు (వీడియో)
మైదానంలో తన వ్యూహాలతో ప్రత్యర్థులను ఓడించే ఎంఎస్ ధోని.. మైదానంలో ప్రశాంతంగా కనిపిస్తుంటాడు. తాజాగా ఐపీఎల్ లో చైన్నై గెలిచిన తర్వాత ధోని భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎప్పుడు బయటపడని ఏమోషన్‌ను ధోనీ తాజాగా బయటపెట్టేశాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఐపీఎల్ 2023 ఫైనల్లో సీఎస్కే విజయం సాధించింది. ఈ సందర్భంగా ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజాను ఎత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎంఎస్ ధోని సారథ్యంలో చైన్నై ఐదోసారి కప్పును సాధించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది సీఎస్కే ట్రోఫిని గెలుచుకుంది.చివర్లో జడేజా వరుసగా సిక్సర్, ఫోర్ సాధించి హీరోగా మారిపోయాడు.
మ్యాచును గెలిపించిన జడేజా
చివరి రెండు బంతుల్లో చైన్నై విజయానికి 10 పరుగులు అవసరం అయ్యాయి. జడేజా క్రీజులో ఉండటంతో సీఎస్కే విజయం అసాధ్యమని పలువురు భావించారు. అయితే అందరి లెక్కలను జడేజా తారుమారు చేసి మోహిత్ శర్మ బౌలింగ్ సిక్సర్, ఫోర్ బాది మ్యాచ్ ను గెలిపించారు. గెలిచిన వెంటనే జడేజాను ధోని ఎత్తుకొని సంబరాలు చేసుకున్నాడు. ఆ సయమంలో ధోనికి కన్నీళ్లు కూడా వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చైన్నై జట్టు గెలవడంతో ధోని అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.