Loading...
Virat Kohli: అందుకే కోహ్లీ-అనుష్క లండన్‌లో స్థిరపడ్డారు..!
అందుకే కోహ్లీ-అనుష్క లండన్‌లో స్థిరపడ్డారు..!

Virat Kohli: అందుకే కోహ్లీ-అనుష్క లండన్‌లో స్థిరపడ్డారు..!

వ్రాసిన వారు Moogati Shabari
Sep 03, 2026
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి కొంతకాలంగా లండన్‌లో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. టీమిండియా మ్యాచ్‌లు, ఐపీఎల్‌ సీజన్‌ సమయంలో మాత్రమే ఆయన భారత్‌కు వస్తున్నారు. దీంతో కోహ్లీపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ కూడా జరిగింది. అయితే విరాట్‌ భారత్‌ను వీడి లండన్‌లో నివసించడానికి అసలు కారణం ఏంటో బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్‌ భర్త డా. శ్రీరామ్‌ నేనే తాజాగా వెల్లడించారు.

వివరాలు

మీడియా దృష్టికి దూరంగా..

లండన్‌కు వెళ్లే ముందు అనుష్క శర్మతో జరిగిన ఓ ఆసక్తికర సంభాషణను డా. శ్రీరామ్‌ గుర్తుచేసుకున్నారు.

యూట్యూబర్‌ రణ్‌వీర్‌ అల్లాబాడియాతో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ తమకున్న స్టార్‌డమ్‌ కారణంగా భారత్‌లో సాధారణ జీవితాన్ని గడపలేకపోతున్నారని తెలిపారు.

అందుకే లండన్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు.

పబ్లిక్‌ అటెన్షన్‌కు దూరంగా ప్రశాంతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతోనే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డా. శ్రీరామ్‌ తెలిపారు.

తమ పిల్లలు వామిక, అకాయ్‌లను కూడా మీడియా దృష్టికి దూరంగా ఉంచి సాధారణ వాతావరణంలో పెంచాలని కోహ్లీ-అనుష్క భావిస్తున్నారని చెప్పారు.

వివరాలు

టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన విరాట్‌ కోహ్లీ..

మరోవైపు టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం వన్డేలు, ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం మాత్రమే భారత్‌కు వస్తున్నారు.

ఇక అనుష్క శర్మ విషయానికి వస్తే.. 2018లో విడుదలైన 'జీరో' సినిమా తర్వాత ఆమె నటనకు దాదాపుగా దూరంగా ఉన్నారు.

ఆ తర్వాత 'చక్దా ఎక్స్‌ప్రెస్‌' సినిమాలో నటించారు. ఇందులో మాజీ భారత క్రికెటర్‌ ఝులన్‌ గోస్వామి పాత్రను అనుష్క పోషించారు.

అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. 2022లో తన నిర్మాణ సంస్థ 'క్లీన్‌ స్లేట్‌ ఫిల్మ్స్‌' బాధ్యతల నుంచి కూడా అనుష్క శర్మ వైదొలిగారు.

ప్రస్తుతం ఆమె కుటుంబ బాధ్యతలపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT