WPL: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బోణి కొట్టేనా..?
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్నో అంచనాలతో బరిలోకి దిగినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఉసూరుమనిపిస్తూ అభిమానులకు తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తుంది. పేరులో రాయల్, జట్టు నిండా స్టార్ ప్లేయర్స్ ఉన్నా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఇంతవరకు ఖాతా తెరవలేదు.
బెంగళూరు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లో ఓడిపోయింది. యూపీ వారియర్స్ రెండు మ్యాచ్ లు ఆడి ఒకదాంట్లో నెగ్గింది. నేడు యూపీ వారియర్స్‌తో బెంగళూరు తలపడనుంది.
ఈ మ్యాచ్ ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో రాత్రి 7:30గంటలకు స్పోర్ట్స్ 18లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ పిచ్ పై టాస్ గెలిచిన జట్టు ముందు బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపుతుంది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్
ఇరు జట్లలోని సభ్యులు
ఢిల్లీతో మ్యాచ్‌లో షఫాలీ, లాన్నింగ్‌లకు కనీసం డాట్ బాల్ వేయలేక ఆర్సీబీ బౌలర్లు అష్టకష్టాలు పడ్డారు. దాదాపుగా బెంగళూరు బౌలర్లు అందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
బెంగళూరు మహిళలు బౌలింగ్ రాణిస్తే విజయం సాధించే అవకాశం ఉంటుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతిమంధాన (సి), సోఫీడివైన్, ఎల్లీస్‌పెర్రీ, హీథర్ నైట్, రిచా ఘోష్ (WK), పూనమ్ ఖేమ్నార్, కనికా అహుజా, శ్రేయాంక పాటిల్, మేగన్ షుట్, రేణుకా ఠాకూర్ సింగ్, ప్రీతి బోస్
యూపీ వారియర్స్ మహిళలు : అలిస్సాహీలీ (c & wk), శ్వేతాసెహ్రావత్, కిరణ్ నవ్‌గిరే, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, సిమ్రాన్ షేక్, దేవికా వైద్య, సోఫీ ఎక్లెస్టోన్, గ్రేస్ హారిస్, అంజలి సర్వాణి, రాజేశ్వరి గయాక్వాడ్