NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో బోణి కొట్టిన గుజరాత్ జెయింట్స్
    తదుపరి వార్తా కథనం
    ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో బోణి కొట్టిన గుజరాత్ జెయింట్స్
    ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ విజయం

    ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో బోణి కొట్టిన గుజరాత్ జెయింట్స్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 09, 2023
    12:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో వరుసగా మూడోసారి రాయల్ బెంగళూర్ ఛాలెంజర్స్ ఓటమిపాలైంది. బుధవారం రాత్రి జరిగిన 6వ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ జట్టు 11 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుపై విజయం సాధించింది.

    ఈ టోర్నిలో గుజరాత్ జెయింట్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. సోఫియా డంక్లీ, హర్లీన్ డియోల్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.

    లక్ష్య చేధనకు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. బెంగళూర్ ఇది హ్యాట్రిక్ ఓటమి.

    బెంగళూర్

    మరోసారి నిరాశ పరిచిన బెంగళూర్

    చేధనలో బెంగళూర్ కెప్టెన్ స్మృతి మంధాన (18) మరోసారి విఫలమైంది. మరో ఓపెనర్ సోఫియా డివైన్ (66: 45 బంతుల్లో 8x4, 2x6) హాఫ్ సెంచరీతో విజృభించినా ఫలితం లేకుండా పోయింది.

    మిడిల్ ఓవర్లలో ఫెర్రీ 32 పరుగులు, హీథర్ నైట్ 30 పరుగులతో రాణించారు. రిఛా ఘోస్ (10), ఆహుజ (10), పూనమ్ (2) కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో బెంగళూర్ కి నిరాశ తప్పలేదు.

    గుజరాత్ టీంలో గార్డెనర్ 3 వికెట్లను పడగొట్టింది. గుజరాత్ ఓపెనర్ సోఫియా డంక్లీ 65 పరుగులు, హర్లీన్ డియాల్ 67 పరుగులతో చేలరేగారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్ కి 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో గుజరాత్ భారీ స్కోరు నమోదు చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుజరాత్ జెయింట్స్
    క్రికెట్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    గుజరాత్ జెయింట్స్

    ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటనున్న గుజరాత్ జెయింట్స్ క్రికెట్
    WPL: గుజరాత్ జెయింట్స్ కు గట్టి ఎదురుదెబ్బ ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    WPL : ముంబై ఇండియన్స్‌తో తలపడనున్న గుజరాత్ జెయింట్స్ క్రికెట్
    WPL 2023: ఉత్కంఠ పోరులో యూపీ వారియర్స్ విజయం క్రికెట్

    క్రికెట్

    BAN vs ENG: జాసన్ రాయ్ సూపర్ సెంచరీ ఇంగ్లండ్
    BAN vs ENG: రెండో వన్డేలో అద్భుతంగా రాణించిన జోస్ బట్లర్ ఇంగ్లండ్
    PSL: వావ్.. సూపర్ మ్యాన్‌లా బంతిని ఆపిన సికిందర్ రాజా పాకిస్థాన్
    BAN vs ENG: బంగ్లాపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లండ్ ఇంగ్లండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025