WPL: ముంబై ఇండియన్స్‌కి విజయాన్ని అందించిన నాట్ స్కివర్ బ్రంట్
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌పై 9 వికెట్ల తేడాతో ముంబై గెలుపొందింది. ముంబై స్టార్ ఓపెనర్ హేలీ మాథ్యూస్ (77), నాట్ స్కివర్ బ్రంట్ (55) చెలరేగడంతో బెంగళూర్‌కు మళ్లీ నిరాశ తప్పలేదు. వీరిద్దరూ విధ్యంసకర బ్యాటింగ్‌తో ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించారు. నటాలీ స్కివర్-బ్రంట్ బౌలింగ్‌లో రెండు వికెట్లతో సత్తా చాటింది.
ఓపెనర్ బాటియా(23) ఎల్బీడబ్య్లూగా వెనుతిరగడంతో నాట్ స్కివర్ బ్రంట్ క్రీజులోకి వచ్చింది. అనంతరం మాథ్యూస్‌తో కలిసి ముంబై ఇండియన్స్ స్కోరును పరిగెత్తించింది. ఆర్సీబీ నిర్ధేశించి 155 పరుగుల లక్ష్యాన్ని వీరద్దరూ కలిసి 14.2 ఓవర్లలోనే చేధించారు.
నాట్ స్కివర్
నాట్ స్కివర్ బ్రంట్‌ని రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ నాట్‌ను ముంబై ఇండియన్స్‌కు రూ. ప్రారంభ WPL వేలంలో 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఆమె ఇప్పటివరకు 108 టీ20ల్లో 26.85 సగటుతో 2,175 పరుగులు చేసింది. ఇందులో 12 అర్ధ సెంచరీలున్నాయి. బౌలింగ్ విభాగంలో 79 వికెట్లను పడగొట్టింది.
బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ ఓపెనర్లు స్మృతి మంధాన, సోఫీ డివైన్ నాలుగు ఓవర్లలో రాయల్ ఛాలెంజర్స్‌ను 35/0తో ముందుకు తీసుకెళ్లారు. అయితే పవర్‌ప్లేలో ఆర్సీబీ వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయింది. రిచా ఘోస్(28), కనికా అహుజా(22) బెంగళూర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్ మూడు వికెట్లు, న్యాట్ స్క్రైవర్ బ్రంట్ రెండు వికెట్లు తీశారు.