Page Loader
WPL 2023: బెంగళూరును చిత్తుగా ఓడించిన ముంబాయి ఇండియన్స్
9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ముంబై ఇండియన్స్

WPL 2023: బెంగళూరును చిత్తుగా ఓడించిన ముంబాయి ఇండియన్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 07, 2023
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ను చిత్తు చేసిన ముంబాయి ఈసారి బెంగళూరును చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబాయి, ఆర్సీబీపై 9 వికెట్ట తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరు నిర్ధేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి 14.2 ఓవర్లలోనే ముంబై చేధించింది. ముంబై స్టార్ ఓపెనర్ హేలీ మాథ్యూస్ (77), న్యాట్ స్క్రైవర్ బ్రంట్ (55) అర్ధశతకాలతో విజృంభించి తమ జట్టుకు భారీ గెలుపును అందించారు. బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ ఓపెనర్లు స్మృతి మంధాన, సోఫీ డివైన్ నాలుగు ఓవర్లలో రాయల్ ఛాలెంజర్స్‌ను 35/0తో ముందుకు తీసుకెళ్లారు. అయితే పవర్‌ప్లేలో ఆర్సీబీ వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయింది.

హేలీ మాథ్యూస్

హేలీ మాథ్యూస్ ఆలౌ రౌండర్ ప్రదర్శన

రిచా ఘోస్(28), కనికా అహుజా(22) బెంగళూర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్ మూడు వికెట్లు, న్యాట్ స్క్రైవర్ బ్రంట్ రెండు వికెట్లు తీశారు. ముంబై ఓపెనర్ మాథ్యూస్ బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించింది. కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించింది. టీ20ల్లో ఆమె 16 అర్ధ సెంచరీలు చేసింది. న్యాట్ స్క్రైవర్ బ్రంట్ 55 విజృంభించడంతో ఏ దశలోనూ బెంగళూరు కోలుకోలేదు. హేలీ మాథ్యూస్ రెండు ఇన్నింగ్స్‌లో కలిసి 124 పరుగులు చేయడంతో అరెంజ్ క్యాప్‌ను అమె సొంతం చేసుకుంది.