Page Loader
WPL: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌పై భారీ అంచనాలు
బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు స్మృతి మంధాన కెప్టెన్

WPL: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌పై భారీ అంచనాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 03, 2023
10:18 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ క్రికెట్‌లో తొలిసారిగా బీసీసీఐ అధ్వర్యంలో మహిళలకు సంబంధించి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించనున్నారు. రేపటి నుంచే డబ్ల్యుపీఎల్ ప్రారంభం కానుంది. వేలంలో స్మృతి మంధాన రూ.3.40 కోట్లకు అమ్ముడుపోయి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఆమె రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుకు కెప్టెన్‌గా నియామకయ్యారు. ఆమెపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్, మేగాన్ షట్ జట్టులో రాణిస్తే ప్రత్యర్థులకు కష్టాలు తప్పవు ఆర్సీబీ వేలంలో 18 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి 11.9 కోట్లు ఖర్చు చేసింది. మొత్తం 12 మంది భారతీయులు, ఆరుగురు విదేశీ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు

బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఇదే

మంధాన మహిళల టీ20లలో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్ గా నిలిచింది. 116 మ్యాచ్‌ల్లో 27.74 సగటుతో 2,802 పరుగులు చేసింది. ఘోష్ 35 మ్యాచ్‌ల్లో 133.41 స్ట్రైక్ రేట్‌తో 563 పరుగులు చేశాడు. ఫెర్రీ 139 మ్యాచ్‌లలో 122 వికెట్లతో అత్యధిక వికెట్లు ఐదో బౌలర్‌గా నిలిచింది. షట్ 96 మ్యాచ్‌ల్లో 124 వికెట్లు తీసి మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. పేసర్ రేణుకా సింగ్ ఇప్పటివరకు 32 టీ20 మ్యాచ్‌లు ఆడి 31 వికెట్లు తీసింది. జట్టు: స్మృతిమంధాన (కెప్టెన్), సోఫీడివైన్, ఎల్లీస్‌పెర్రీ, రేణుకాసింగ్, రిచాఘోష్, ఎరిన్‌బర్న్స్, దిశాకసత్, ఇంద్రాణి‌రాయ్, ఆశాశోబనా, కనికాఅహుజా, డేన్‌వాన్ నీకెర్క్, ప్రీతీబోస్, పూనమ్‌ఖేమ్నార్, కోమల్‌జంచుజాడ్ , సహానా పవార్, హీథర్‌నైట్, శ్రేయాంక పాటిల్.