Page Loader
మహిళల ఐపీఎల్ మస్కట్ చూస్తే గూస్‌బంప్స్
మస్కట్‌ను విడుదల చేసిన బీసీసీఐ కార్యదర్శి జైషా

మహిళల ఐపీఎల్ మస్కట్ చూస్తే గూస్‌బంప్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 02, 2023
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ తరహాలో భారత్‌లో అమ్మాయిల క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు మహిళల ప్రీమియర్ లీగ్ సిద్ధమవుతంది. మార్చి 4న ఈ టోర్నీ వైభవంగా ప్రారంభం కానుంది. ముంబై వేదికగా జరిగే ఈ లీగ్‌లో ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. ఈ మెగా లీగ్‌కి మరింత ప్రచారం తీసుకొచ్చేందుకు తాజాగా మస్కట్ ను బీసీసీఐ కార్యదర్శి జై షా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఒక చేత్తో బ్యాట్, మరో చేతిలో హెల్మెట్ పట్టుకొని రంగంలో దిగడానికి సిద్ధంగా ఉన్న చీతాను అందులో చూపించారు. దానికి శక్తి(Shakti) అని నామకరణం చేశారు. మార్చి 4 నుంచి 26 వరకు మ్యాచ్ లు ముంబైలో జరగనుంది. మొదటి మ్యాచ్‌లో ముంబై, అహ్మదాబాద్ జట్టు తలపడనున్నాయి.

ఉమెన్స్ ఐపీఎల్

ఫ్రాంచేజీలను కొనుగోలు చేసిన వివరాలు

గౌతమ్ అదానీకి చెందిన అదానీ స్పోర్ట్స్ లైన్ ప్రైవేట్ లిమిటెడ్ అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీని రూ.1289 కోట్లకు దక్కించుకుంది. ముంబై ఫ్రాంచైజీని రూ.912 కోట్లకు ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ సొంతం చేసుకుంది. బెంగళూరు ఫ్రాంచైజీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన రాయల్ ఛాలెంజర్స్ స్పోర్స్ ప్రయివేట్ లిమిటెడ్ రూ.901 కోట్లకు దక్కించుకుంది. ఢిల్లీ ఫ్రాంచైజీని జేఎస్‌డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రయివేట్ లిమిటెడ్ రూ.810 కోట్లకు సొంతం చేసుకుంది. లక్నోను రూ.757 కోట్లకు కాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ ప్రయివేట్ లిమిండ్ దక్కించుకుంది.