Page Loader
WPL 2023: ఆర్‌సీబీ కెప్టెన్‌గా స్మృతి మంధన.. ప్రకటించిన ఆర్సీబీ
రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్‌గా ఎంపికైన మంధాన

WPL 2023: ఆర్‌సీబీ కెప్టెన్‌గా స్మృతి మంధన.. ప్రకటించిన ఆర్సీబీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 18, 2023
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంపికైంది. ఈ విషయాన్ని బెంగళూర్ టీమ్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఉమెన్స్ లీగ్ వేలంలో మంధాన అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలిచింది. వేలంలో రూ.3.కోట్ల 40 లక్షలకు బెంగళూర్ స్మృతి మంధాన కొనుగోలు చేసింది. మంధానతో పాటు ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ బెంగళూర్ తరుపున ఆడనుంది. గత కొన్నేళ్లుగా టీ20ల్లో మంధాన కీలక పాత్ర పోషిస్తోంది. మహిళల T20Iలలో అత్యధిక పరుగులు చేసిన ఏడో ప్లేయర్‌గా ఎంపికైంది. 27.15 సగటుతో 2,661 పరుగులు చేసింది. ఇందులో మంధాన 20 అర్ధ సెంచరీలు చేసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో 18 మ్యాచ్‌లు ఆడి 308 పరుగులు చేసింది.

ఉమెన్స్ లీగ్

మార్చి 4న ఉమెన్స్ లీగ్ ప్రారంభం

ఆర్సీబీ రూ. ముగిసిన వేలంలో 18 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి 11.9 కోట్లు ఖర్చు చేసింది. ఈ లెక్కన 12 మంది భారతీయులు ఆరుగురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. WPL మార్చి 4న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ కానుంది. చివరి మ్యాచ్ 26న ముగుస్తుంది. ముంబైలోని రెండు వేదికలలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 22న మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు DY పాటిల్ స్టేడియం, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరుగుతాయి. జట్టు: స్మృతిమంధాన, సోఫీడివైన్, ఎల్లీస్‌పెర్రీ, రేణుకాసింగ్, రిచాఘోష్, ఎరిన్‌బర్న్స్, దిశాకసత్, ఇంద్రాణిరాయ్, ఆశాశోబన, కనికాఅహుజా, డేన్ వాన్ నీకెర్క్, ప్రీతిబోస్, పూనమ్ ఖేమ్నార్, కోమల్ జంచుజాద్, సగానా జంచుజాద్ , హీథర్ నైట్, శ్రేయాంకపాటిల్