Page Loader
WPL : ముంబై ఇండియన్స్‌తో తలపడనున్న గుజరాత్ జెయింట్స్
గుజరాత్ జెయింట్స్ కెప్టెన్స్‌గా బెత్‌మూనీ

WPL : ముంబై ఇండియన్స్‌తో తలపడనున్న గుజరాత్ జెయింట్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 04, 2023
05:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్‌కు సర్వం సిద్ధమైంది. గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ లీగ్ షూరు కానుంది. ఈ మ్యాచ్ డివై పాటిల్ అకాడమీ వేదికగా శనివారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఫామ్‌లో ఉన్న బెత్ మూనీ గుజరాత్ జెయింట్స్ జట్టుకు నాయకత్వం వహించనుంది. ఆష్లీ గార్డనర్, సోఫియా డంక్లీ, స్నేహ్ రానా మెరుగ్గా రాణించనుంది. ఈ జట్టులో 12 మంది భారతీయులు, ఆరుగురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వెస్టిండీస్ మాజీ ఆలౌరౌండర్ డియాండ్రా డాటిన్ గాయం కారణంగా టోర్ని మొత్తానికి దూరమైంది. డాటిన్ స్థానాన్ని ఆస్ట్రేలియా యువ ఆల్ రౌండర్ గార్త్‌తో చేసింది.

గుజరాత్ జెయింట్స్

గుజరాత్ జెయింట్స్ జట్టు ఇదే..

ఆల్-రౌండర్ గార్డనర్ 73 టీ20 మ్యాచ్‌లు 1,176 పరుగులు చేశాడు. ICC మహిళల T20 ప్రపంచకప్‌లో మూనీ అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. సోఫియా డంక్లీ 44 టీ20 మ్యాచ్‌లో 24.14 సగటుతో 652 పరుగులు చేసింది. కిమ్ గార్త్ 54 టీ20 మ్యాచ్‌లో 23.09 సగటుతో 762 పరుగులు చేశాడు. జట్టు: ఆష్లీ గార్డనర్, బెత్ మూనీ (కెప్టెన్), సోఫియా డంక్లీ, అన్నాబెల్ సదర్లాండ్, హర్లీన్ డియోల్, కిమ్ గార్త్, స్నేహ రాణా, ఎస్ మేఘన, జార్జియా వేర్‌హామ్, మాన్సీ జోషి, డి హేమలత, మోనికా పటేల్, తనూజా కన్వర్, సుష్మా వర్మ, హర్లీ గాలా, అశ్వనీ కుమారి, పరుణికా సిసోడియా, షబ్నిమ్ షకీల్.