Page Loader
WPL: గుజరాత్ జెయింట్స్ కు గట్టి ఎదురుదెబ్బ
గుజరాత్ జెయింట్స్ జట్టుకు దూరమైన డియాండ్రా డాటిన్

WPL: గుజరాత్ జెయింట్స్ కు గట్టి ఎదురుదెబ్బ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 04, 2023
01:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల ఐపీఎల్ లీగ్ ప్రారంభానికి ముందే గుజరాత్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నేడు ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7.30గంటలకు డివై పాటిల్ స్టేడియంలో ప్రారంభం కానుంది. గుజరాత్ జెయింట్స్ కు డియాండ్రా డాటిన్ దూరం కావడంతో ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది.ఆమె స్థానంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కిమ్ గార్త్‌ను ఎంపికైంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన ICC మహిళల T20 ప్రపంచ కప్ టైటిల్‌ను సాధించడంతో ఆస్ట్రేలియా ప్లేయర్ గార్త్ కీలక పాత్ర పోషించింది. డియాండ్రా డాటిన్ గాయం కారణంగా జట్టుకు దూరమైనట్లు తెలుస్తోంది. ముంబై జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్, గుజరాత్ జెయింట్స్ బెత్ మునీ నాయకత్వం వహించనున్నారు.

గార్త్

డోటిన్ స్థానంలో గార్త్

డోటిన్ రూ. 60 లక్షల బేస్ ధరతో గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఆమె కొన్నేళ్లుగా వెస్టిండీస్ తరుపున అద్భుతంగా రాణిస్తోంది. ఇంతవరకు 127 టీ20 మ్యాచ్‌లు ఆడి 25.68 సగటుతో 2,697 పరుగులు చేసింది. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ విభాగంలో 62 వికెట్లు తీసింది. గార్త్ టీ20 వరల్డ్ కప్ ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే ఐర్లాండ్ తరుపున 20 ఓవర్ల ఫార్మాట్‌లో అద్భుతంగా రాణించింది. 54 టీ20 మ్యాచ్‌లు ఆడి 23.09 సగటుతో 762 పరుగులను చేసింది. రైట్ ఆర్మ్ పేస్ బౌలింగ్‌లో గార్త్ 43 వికెట్లు పడగొట్టడం గమనార్హం.