
WPL: నేటి నుంచి మహిళల ఐపీఎల్ షురూ
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు సర్వం సిద్ధమైంది. మహిళల క్రికెటర్లు ఎన్నాళ్లు నుంచే ఈ క్షణం ఎదురుచూస్తున్నాడు. ఈ నిరీక్షణకు తెరదించుతూ నేటి నుంచే మహిళల ఐపీఎల్ ప్రారంభం కానుంది. నేడు రాత్రి 7.30గంటలకు మొదటి మ్యాచ్ గుజరాత్ జెయింట్స్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.
అదానీ గ్రూప్ అహ్మదాబాద్‌కు చెందిన ఫ్రాంచైజీని రూ. 1,289 కోట్లు, ఇండియావిన్ స్పోర్ట్స్ ప్రై. లిమిటెడ్ ముంబై ఇండియన్స్ జట్టును రూ. 912.99 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రై.లిమిటెడ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును రూ. 901 కోట్లు, JSW GMR క్రికెట్ ప్రై.లిమిటెడ్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను రూ. 810 కోట్లు. కాప్రి గ్లోబల్ UP వారియర్జ్‌ను రూ. 757 కోట్లకుసొంత చేసుకున్నాయి.
వయాకామ్ 18
ప్రసార హక్కులను సొంతం చేసుకున్న వయాకామ్ 18
2 ప్లే-ఆఫ్‌లతో సహా మొత్తం 23 రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది. మహారాష్ట్రలోని డివై పాటిల్ స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశలో ఒక్కో జట్టు 8 మ్యాచ్‌లు ఆడనుంది. తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్ దశకు చేరుకుంటాయి.
పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. రెండవ, మూడవ స్థానంలో ఉన్న జట్లు రెండవ ఫైనలిస్ట్‌ను కోసం ఎలిమినేటర్‌లో తలపడతాయి.
వయాకామ్ 18 WPL ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. స్పోర్ట్స్ 18, స్పోర్ట్స్ ఖేల్, కలర్స్ సినిమా, కలర్స్‌తమిళ్, కలర్స్‌కన్నడ సినిమాలలో మ్యాచ్‌లు ప్రసారం కానున్నాయి.