Page Loader
ఐపీఎల్‌లో వృద్ధిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్ అరుదైన ఘనత
ఐపీఎల్‌లో 2500 పరుగులు చేసిన సాహా, మిల్లర్

ఐపీఎల్‌లో వృద్ధిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్ అరుదైన ఘనత

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 14, 2023
04:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ప్లేయర్లు వృద్ధిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్ అరుదైన రికార్డు సాధించారు. పంజాబ్ కింగ్స్ పై వృద్ధిమాన్ సాహా 19 బంతుల్లో 30 పరుగులు, మిల్లర్ 18 బంతుల్లో 17 పరుగులు చేసి అరుదైన ఫీట్ ను సాధించారు. ఐపీఎల్ లో ఈ ఇద్దరు ఆటగాళ్లు 2500 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లగా రికార్డు సృష్టించారు. సాహా 148 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 2513 పరుగులు సాధించారు. ఇందులో 11 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉంది.

ఐపీఎల్

ఐపీఎల్‌లో 2505 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్

మిల్లర్ 108 మ్యాచ్‌ల్లో 2505 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 11 అర్ధ సెంచరీలున్నాయి. మ్యాచ్ విషయానికొస్తే గిల్ 49 బంతుల్లో 67 పరుగులు చేశాడు. దీంతో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరి రెండు బంతుల్లో నాలుగు పరుగులు అవసరం కాగా.. రాహుల్ తెవాటియా ఫోర్ కొట్టి మ్యాచ్ కు విజయాన్ని అందించారు. గుజరాత్ ఈ విజయంలో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. గుజరాత్ ఏప్రిల్ 16న రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది.