Page Loader
IPL 2023: గుజరాత్ టైటాన్స్‌ను గెలిపించిన శుభ్‌మాన్ గిల్
హాఫ్ సెంచరీతో జట్టును అదుకున్న శుభ్‌మాన్ గిల్

IPL 2023: గుజరాత్ టైటాన్స్‌ను గెలిపించిన శుభ్‌మాన్ గిల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 13, 2023
11:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

మొహాలీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని గుజరాత్‌ టైటాన్స్‌ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పంజాబ్ బ్యాటర్లలో మాథ్యూ షార్ట్ 36, రాజపక్సే 20, శామ్ కర్రన్ 22, షారుఖ్ ఖాన్ 22 పరుగులు చేయడంతో పంజాబ్ గౌరవప్రదమైన స్కోరును చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 2, మహ్మద్ షమీ, రషీద్ ఖాన్, జాషువా లిటిల్ , అల్జారీ జోసెఫ్తలా ఓ వికెట్ తీశారు.

శుభ్‌మాన్ గిల్

హాఫ్ సెంచరీ చేసిన శుభ్‌మాన్ గిల్

లక్ష్య చేధనకు దిగిన గుజరాత్ ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభమాన్ గిల్ శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ మొదటి వికెట్ కు 48 పరుగులు జోడించారు. సాహా 30 పరుగులు చేసి, రబడ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.తర్వాత క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్ 19, కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 8 పరుగులతో నిరాశ పరిచారు. శుభ్ మాన్ గిల్ 67 పరుగులు చేసి గుజరాత్ టైటాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరి రెండు బంతుల్లో 4 పరుగులు అవసరం కాగా.. రాహుల్ తెవాటియా ఫోర్ కొట్టి మ్యాచ్ ను గెలిపించాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, కసిగో రబడ, హర్‌ప్రీత్ బ్రార్ తలా ఓ వికెట్ తీశారు.