LOADING...
IPL 2023: చేతులెత్తేసిన పంజాబ్ బ్యాటర్లు.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
153 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్

IPL 2023: చేతులెత్తేసిన పంజాబ్ బ్యాటర్లు.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 13, 2023
09:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్ లోని మొహాలీ స్టేడియంలో గురువారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు షమి వేసిన తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్ (0) రెండో బంతికే ఔటయ్యాడు. అనంతరం శిఖర్ ధావన్ జాషువా లిటిల్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో పంజాబ్ 28 ఓవర్లకే 2 వికెట్లు కోల్పోయింది. మాథ్యూ షార్ట్, రాజపక్సే పంజాబ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మాథ్యూ షార్ట్ 36(24) పరుగులు చేసి, రషీద్ ఖాన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

గుజరాత్

రాణించిన గుజరాత్ బౌలర్లు

రాజపక్సే 26 బంతుల్లో 20 పరుగులు చేసి నిరాశపరిచాడు. శామ్ కర్రన్ 22 పరుగులు చేశాడు. చివర్లో షారుఖ్ ఖాన్ 9 బంతుల్లో 22 పరుగులతో చెలరేగాడు. దీంతో పంజాబ్ గౌరవ ప్రదమైన స్కోరును చేయగలిగింది.పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 2, మహ్మద్ షమీ, రషీద్ ఖాన్, జాషువా లిటిల్ , అల్జారీ జోసెఫ్తలా ఓ వికెట్ తీశారు.