Page Loader
IPL 2023: గుజరాత్ టైటాన్స్ - పంజాబ్ కింగ్స్‌లో విజయం ఎవరిది?
నేడు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ ఢీ

IPL 2023: గుజరాత్ టైటాన్స్ - పంజాబ్ కింగ్స్‌లో విజయం ఎవరిది?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 13, 2023
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023‌లో భాగంగా గురువారం 18వ మ్యాచ్ జరగనుంది. మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. మ్యాచ్ రాత్రి 7:30గంటలకు ప్రసారం కానుంది. సన్ రైజర్స్ చేతిలో ఓడిపోయిన పంజాబ్ కింగ్స్ నేటి మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గాలని తహతహలాడుతోంది. మరోపక్క రికూసింగ్ దెబ్బకు ఐపీఎల్ మొదటిసారి ఓడిపోయిన గుజరాత్ ఈసారి ఎలాగైనా గెలవాలని గట్టి పట్టుదలతో ఉంది. పంజాబ్ కింగ్స్ మూడు మ్యాచ్‌లో ఒక మ్యాచ్ నెగ్గగా.. గుజరాత్ మూడు మ్యాచ్‌లో రెండు విజయాలను సాధించింది. గుజరాత్, పంజాబ్ గత సీజన్‌లో రెండుసార్లు తలపడగా.. ఇద్దరు చెరో మ్యాచ్‌లో విజయం సాధించారు.

గుజరాత్

గుజరాత్, పంజాబ్ కింగ్స్‌లోని సభ్యులు

ఇంగ్లండ్‌కు చెందిన లివింగ్ స్టోన్ పంజాబ్ కింగ్స్‌లో చేరాడు. ఈ మ్యాచ్ రాజపక్సే ఆడడం అనుమానంగా ఉంది. అతను అందుబాటులో లేకపోతే సికిందర్ రాజా అడే అవకాశం ఉంది. చివరి మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ హార్ధిక్‌పాండ్యా నేటి మ్యాచ్‌కు తిరిగిరానున్నాడు. ఐఎస్ బింద్రా స్టేడియంలో 7 మ్యాచ్‌లు జరగ్గా... ఇందులో ఛేజింగ్‌ జట్లు ఐదుసార్లు గెలిచాయి. PBKS: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్‌ధావన్ (c), లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (wk), భానుక రాజపక్స, సామ్ కర్రాన్, షారుక్‌ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, చాహర్, నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్‌సింగ్ GT: వృద్ధిమాన్‌సాహా (WK), గిల్, సాయి సుదర్శన్, హార్దిక్‌పాండ్యా (c), విజయ్ శంకర్, మిల్లర్, తెవాటియా, రషీద్ ఖాన్, షమీ, అల్జారీ జోసెఫ్, జాషువా లిటిల్