Page Loader
ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన శిఖర్ ధావన్
ఐపీఎల్‌లో అరుదైన ఘనతను సాధించిన శిఖర్ ధావన్

ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన శిఖర్ ధావన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 06, 2023
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 8వ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్ చివరి వరకు పోరాడినప్పటికీ విజయం మాత్రం పంజాబ్‌నే వరించింది. ఈ మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఓపెనర్లు శిఖర్ ధావన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అర్ధశతకాలతో చెలరేగారు. ముఖ్యంగా ధావన్ 56 బంతుల్లో 86 పరుగులు చేసి, ఐపీఎల్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక అర్ధశతకాలు సాధించిన మూడో బ్యాటర్ గా శిఖర్ ధావన్ నిలిచాడు. ధావన్ 50 అర్ధశతకాలు నమోదు చేసి ఎలైట్ క్లబ్‌లో చేరాడు. డేవిడ్ వార్నర్(60), కోహ్లీ (50) హాఫ్ సెంచరీలు చేసి అతడి కంటే ముందు స్థానంలో ఉన్నారు.

ధావన్

రాజస్థాన్ రాయల్స్‌పై ఏడు అర్ధ సెంచరీలు చేసిన ధావన్

అదే విధంగా ఐపీఎల్ లో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన రెండో టీమిండియా బ్యాటర్‌గా రికార్డు నమోదు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ పై ధావన్ 22 మ్యాచ్‌ల్లో 126 స్ట్రైక్ రేట్‌తో 576 పరుగులు చేయడం విశేషం. ఇందులో ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి మ్యాచ్ విషయానికొస్తే.. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లీస్ 4 వికెట్లతో విజృంభించడంతో పంజాబ్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలవడం ఇది మూడోసారి కావడం విశేషం.