Page Loader
ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ విజయం
25 బంతుల్లో 42 పరుగులు చేసిన సంజు శాంసన్

ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2023
11:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

గౌహతి స్టేడియం వేదికగా బుధవారం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై పంజాబ్ కింగ్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ ఓపెనర్లు ప్రభసిమ్రాన్ సింగ్, శిఖర్‌ధావన్ మంచి ఆరంభాన్ని అందించారు. ప్రభసిమ్రాన్ సింగ్ కేవలం 34 బంతుల్లో( 7 ఫోర్లు, 3 సిక్సర్లు) 60 పరుగులతో విజృంభించాడు శిఖర్ ధావన్ 56 బంతుల్లో (9 ఫోర్లు, 3 సిక్సర్లు) 86 పరుగులతో చేలరేగాడు.

రాజస్థాన్

నాలుగు వికెట్లతో చెలరేగిన ఇల్లీస్

లక్ష్య చేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు శుభారంభం లభించలేదు. యశస్వీ జైస్వాల్ (1 1), అశ్విన్ (0) పూర్తిగా నిరాశపరిచారు. జోస్ బట్లర్, కెప్టెన్ సంజు శాంసన్ రాజస్థాన్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. జోస్ బట్లర్, ఇల్లీస్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ కావడంతో రాజస్థాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. సంజు శాంసన్ 25 బంతుల్లో 42 పరుగులతో ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. చివర్లో హిట్ మెరుపులు , ఇంపాక్ట్ ప్లేయర్ జురెల్ మెరిపించినా ఫలితం లేకుండా పోయింది. చివర్లో 16 పరుగులు అవసరం కాగా.. కేవలం 9 పరుగులు మాత్రమే వచ్చాయి. పంజాబ్ బౌలర్లలో ఇల్లీస్ నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.