రాజస్థాన్ రాయల్స్ Vs పంజాబ్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్.. గెలుపు ఎవరిదో
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బుధవారం ఎనిమిదో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2023లో ఇరు జట్లు మొదటి మ్యాచ్‌లో విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం రెండో విజయాన్ని సాధించాలని రెండు జట్లు తహతహలాడుతున్నాయి. పంజాబ్ కింగ్స్ తొలి మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్‌ను ఏడు పరుగుల (DLS పద్ధతి) తేడాతో ఓడించింది. లివింగ్‌స్టోన్, రబడా అందుబాటులో లేనప్పటికీ, ధావన్, ప్రభ్‌సిమ్రాన్‌సింగ్ జట్టుకు శుభారంభాన్ని అందించారు. శ్రీలంక బ్యాటర్ రాజపక్సే విధ్యంకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. జితేశ్, సికిందర్‌రజా, సామ్‌కరణ్, షారుఖ్ ఖాన్ అందరూ మంచి టచ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో అర్ష్‌దీప్‌సింగ్, చాహర్, సికందర్ రజా రాణిస్తున్నారు.
ఇరు జట్లలోని సభ్యులు
రాజస్థాన్ బ్యాటర్లు అంతా భీకర ఫామ్‌లో ఉన్నారు. . ఓపెనర్లు జోస్ బట్లర్, యశస్వీ జైశ్వాల్ సిక్సర్లతో అదరగొడుతున్నారు. హెట్‌మైయిర్, దేవదత్ పడిక్కల్, జేసన్ హోల్డర్, రియాన్ పరాగ్, అక్షత్ వశిష్టతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, కేఎం ఆసిఫ్, హోల్డర్, పరాగ్, సందీప్ శర్మ బౌలింగ్‌లో సత్తా చాటే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్ జట్టు : ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్‌సింగ్ (వికెట్ కీపర్), రాజపక్స, జితేష్‌శర్మ, షారుక్‌ఖాన్, సామ్‌కర్రాన్, సికందర్‌రజా, నాథన్‌ఎల్లిస్, హర్‌ప్రీత్‌బ్రార్, చాహర్, అర్ష్‌దీప్‌సింగ్ రాజస్థాన్ రాయల్స్ జట్టు: యశస్వి జైస్వాల్, బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్), పడిక్కల్, హెట్మెయర్, పరాగ్, జాసన్ హోల్డర్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, KM ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్