చెలరేగిన రాజపక్సే.. కోల్‌కతా ముందు భారీ టార్గెట్
పంజాబ్ లోని మొహాలి స్టేడియంలో నేడు పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రాజపక్సే సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. రాజపక్సే హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ శిఖర్ ధావన్ 40 పరుగులతో రాణించాడు. 20 ఓవర్లలో 5 వికెట్ట నష్టానికి 191 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచి కోల్‌కతా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన పంజాబ్‌కు శుభారంభం లభించలేదు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ రెండో ఓవర్లో టీమ్ సౌథీ బౌలింగ్‌లో ఔట్ కావడంతో పంజాబ్ మెరుగైన ఆరంభం దక్కలేదు. అనంతరం క్రీజులో వచ్చిన రాజపక్సే.. కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. శిఖర్ ధావన్, రాజపక్సే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
సమిష్టిగా రాణించిన పంజాజ్ బ్యాటర్లు
అనంతరం రాజపక్సే.. ఉమేష్ యాదవ్ బౌలింగ్ ఔట్ అయ్యాడు. అనంతరం శిఖర్ ధావన్ వరుణ్ చక్రవర్తిలో బౌలింగ్ ఔట్ అయ్యాడు. జితేష్ శర్మ 11 బంతుల్లో 21 పరుగులు, సికిందర్ రాజా 13 బంతుల్లో 16 పరుగులు చేసి వెనుతిరిగారు. చివర్లో శామ్ కర్రన్ చెలరేగడంతో కోల్‌కతా భారీ స్కోరు చేసింది. శామ్ కర్రన్ 17 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లు ఉన్నాయి. షారుఖాన్ 7 బంతుల్లో 11 పరుగులు చేశాడు. కోల్ కత్తా బౌలర్లలో సౌథీ రెండు వికెట్లు, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తలా ఒక వికెట్ తీశారు.