NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / విజృంభించిన శిఖర్ ధావన్, ప్రభసిమ్రాన్ సింగ్.. పంజాబ్ భారీ స్కోరు
    తదుపరి వార్తా కథనం
    విజృంభించిన శిఖర్ ధావన్, ప్రభసిమ్రాన్ సింగ్.. పంజాబ్ భారీ స్కోరు
    హాఫ్ సెంచరీతో చెలరేగిన శిఖర్ ధావన్

    విజృంభించిన శిఖర్ ధావన్, ప్రభసిమ్రాన్ సింగ్.. పంజాబ్ భారీ స్కోరు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 05, 2023
    09:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గౌహతి స్టేడియం వేదికగా బుధవారం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది.

    బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ ఓపెనర్లు ప్రభసిమ్రాన్ సింగ్, శిఖర్‌ధావన్ మంచి ఆరంభాన్ని అందించారు. ప్రభసిమ్రాన్ సింగ్ కేవలం 34 బంతుల్లో( 7 ఫోర్లు, 3 సిక్సర్లు) 60 పరుగులతో విజృంభించాడు

    వీరిద్దరూ మొదటి వికెట్ 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం ప్రభసిమ్రాన్ సింగ్ హోల్డర్ బౌలింగ్ క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.

    క్రీజులోకి దిగిన రాజపక్సే కేవలం ఒక బంతిని ఎదుర్కొన్నాడు. శిఖర్ ధావన్ వేగంగా షాట్ కొట్టడంతో ఆ బంతి రాజపక్సే మోచేతికి బలంగా తాకింది. దీంతో రాజపక్సే మైదానాన్ని వీడాడు.

    పంజాబ్

    రాణించిన పంజాబ్ బ్యాటర్లు

    జితేష్ శర్మ తో కలిసి శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. జితేష్ శర్మ 16 బంతుల్లో 27 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 16 ఓవర్లకే పంజాబ్ 159-3 స్కోరు చేసింది. సికిందర్ రాజా(1) నిరాశపరిచాడు. శిఖర్ ధావన్ 56 బంతుల్లో (9 ఫోర్లు, 3 సిక్సర్లు) 86 పరుగులతో విజృంభించాడు.

    పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.

    రాజస్థాన్ బౌలర్లలో హోల్డర్ రెండు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్, , యుజేంద్ర చాహెల్ తలా ఓ వికెట్ తీశారు.

    ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై (661) ఎక్కువ రన్స్ చేసిన ఆటగాడిగా శిఖర్ ధావన్ రికార్డు సృష్టించాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్ రాయల్స్
    ఐపీఎల్

    తాజా

    Ayodhya: అయోధ్యలో మరోసారి ప్రాణప్రతిష్ఠ.. రామ దర్బార్‌తోపాటు మరిన్ని దేవాలయాల ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు అయోధ్య
    Heavy rains: తెలంగాణలో రెయిన్ అలర్ట్ జారీ.. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం భారీ వర్షాలు
    Rana Naidu Season 2: 'రానా నాయుడు' సీజన్‌2 ట్రైలర్ వచ్చేసింది! రానా దగ్గుబాటి
    Op Sindoor: మరో 8 ప్రాంతాలపై భారత్ దాడులు.. బయటపెట్టిన పాక్ ప్రభుత్వ పత్రాలు! ఆపరేషన్‌ సిందూర్‌

    రాజస్థాన్ రాయల్స్

    ఐపీఎల్ 2023: ఆడిన మొదటి బంతికే కెమెరాను పగులకొట్టిన జోరూట్ క్రికెట్
    ఐపీఎల్‌లో యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించే అవకాశం ఐపీఎల్
    IPL 2023 : రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్‌ను చూస్తే వణుకు పుట్టాల్సిందే..! ఐపీఎల్
    ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చాహెల్ సంచలన రికార్డు ఐపీఎల్

    ఐపీఎల్

    సన్ రైజర్స్ ఆటగాళ్ల బలాబలాలపై ఓ లుక్కేయండి..! సన్ రైజర్స్ హైదరాబాద్
    ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి టైటిల్‌ను ముద్దాడేనా ..? సన్ రైజర్స్ హైదరాబాద్
    IPL 2023 : టైటిల్‌ను గెలవడానికి లక్నో సూపర్ జెయింట్స్ రెడీ లక్నో సూపర్‌జెయింట్స్
    IPL 2023: కేకేఆర్‌ను మట్టికరిపించడానికి పంజాబ్ సిద్ధం క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025