Page Loader
పంజాబ్ కింగ్స్‌తో నేడు మ్యాచ్.. సంచలన రికార్డుపై గురి పెట్టిన చాహెల్
మరో అరుదైన రికార్డుకు చేరువలో చాహెల్

పంజాబ్ కింగ్స్‌తో నేడు మ్యాచ్.. సంచలన రికార్డుపై గురి పెట్టిన చాహెల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2023
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో రాజస్థాన్ ప్లేయర్ యుజేంద్ర చాహెల్ ఎన్నో రికార్డులను సృష్టించాడు. తన స్పిన్ మాయజాలంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్స్‌కు దడ పుట్టిస్తున్నాడు. మొన్న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహెల్ నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. గౌహతి వేదికగా బుధవారం రాజస్థాన్ రాయల్స్- పంజాబ్‌కింగ్స్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఈ ఐపీఎల్‌లో ఇరు జట్లు చెరో విజయం సాధించి మంచి జోష్ మీద ఉన్నారు. ఈమ్యాచ్‌లో యుజేంద్ర చాహెల్‌లో ఓ భారీ రికార్డును నెలకొల్పనున్నాడు. ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ పడగొడితే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డుకెక్కనున్నాడు. అతను ఇప్పటివరకు ఐపీఎల్‌లో 132 మ్యాచ్‌లు ఆడి 170 వికెట్లు పడగొట్టాడు.

చాహెల్

అరుదైన రికార్డు‌కు చేరువలో చాహెల్

శ్రీలంక పేసర్ లసిత్ మలింగ 161 మ్యాచ్ లో 170 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో మలింగ‌తో సమానంగా చాహెల్ ఉన్నాడు. ఇప్పటికే ఐపీఎల్ లో అత్యధిక వికెట్ల రికార్డు వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో(183) పేరిట ఉంది. అయితే ఈ సీజన్‌లో 14 వికెట్లు పడగొడితే ఐపీఎల్‌లో హైయెస్ట్ వికెట్లు తీసిన ఆటగాడిగా చాహల్ నిలవనున్నాడు. ప్రస్తుత సీజన్‌లో చహల్‌కు మినహా మరే ఏ బౌలర్‌కు ఈ రికార్డు సాధించే అవకాశం లేదు. ఐపీఎల్ లో 150 కంటే ఎక్కువ వికెట్లను అశ్విన్(158), భువనేశ్వర్‌ కుమార్‌(154), సునీల్ నరైన్ (153) తీశారు.