ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చాహెల్ సంచలన రికార్డు
టీమిండియా స్పిన్నర్ యుజేంద్ర చాహెల్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో చాహెల్ 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆయన ఓ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టీ20ల్లో 300 వికెట్లు పైగా సాధించిన క్రికెటర్‌గా చాహెల్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేయడం ద్వారా ఆ ఫీట్‌ను సాధించాడు. టీ20ల్లో ఇప్పటివరకూ యుజ్వేంద్ర చాహల్ - 303, రవిచంద్రన్ అశ్విన్ 287, పీయూష్ చావ్లా 276, అమిత్ మిశ్రా 272, జస్ప్రీత్ బుమ్రా 256 వికెట్లను తీశారు.
ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్‌గా చాహెల్
అంతేకాకుండా ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్‌గా చాహెల్ నిలిచాడు. ఇప్పటివరకూ చాహెల్ 170 వికెట్లు తీసి మొదటి స్థానంలో ఉండగా.. చాహల్ తర్వాత అమిత్ మిశ్రా 167 వికెట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. పియూష్ చావ్లా 157 వికెట్లతో మూడో స్థానంలో ఉండడం విశేషం. చాహెల్ కంటే డ్వేన్ బ్రావో (183) వికెట్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మ్యాచ్ విషయానికొస్తే రాజస్థాన్ రాయల్స్ చేతిలో సన్ రైజర్స్ 72 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.