72 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఓటమి
ఐపీఎల్ లో సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ దారుణ ఓటమిని చవిచూసింది. మొదట టాస్ గెలిచి హైదరాబాద్ టాస్ గెలిచింది. బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగారు. వీరిద్దరూ కలిసి 6 ఓవర్లలోనే 85 పరుగులకు చేశాడు. బట్లర్ 22 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేయగా.. యశస్వీ జైస్వాల్ 37 బంతుల్లో (9ఫోర్లు) 54 పరుగులు చేశాడు. మరోవైపు కెప్టెన్ సంజు శాంసన్ 32 బంతుల్లో (మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) 55 పరుగులతో చెలరేగాడు. చివర్లో హిట్‌మేయర్ 22 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.
విజృంభించిన చాహెల్, బౌల్ట్
దీంతో రాజస్థాన్ 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో ఫారుఖీ, నటరాజన్ రెండు వికెట్లు తీయగా.. ఉమ్రాన్ మాలిక్ ఒక వికెట్ తీశాడు. లక్ష్య చేధనకు దిగిన సన్ రైజర్స్‌కు శుభారంభం దక్కలేదు. టెంట్ర్ బౌల్డ్ మొదటి ఓవర్లలోనే అభిషేక్ శర్మ (0), రాహుల్ త్రిపాఠిని (0) ఔట్ చేసి సన్ రైజర్స్‌కు కోలుకోలేని దెబ్బ తీశాడు. యుజేంద్ర చాహెల్ మూడు వికెట్లతో విజృంభించడంతో సన్ రైజర్స్ ఓటమి దాదాపు ఖరారైంది సన్ రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.